Mohammed Shami: గుజరాత్ టైటాన్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ

Mohammed Shami: పేసర్ మొహ్మద్ షమీ.. IPL 2024కు దాదాపుగా దూరమయ్యాడు. వన్డే ప్రపంచకప్ (World Cup) తర్వాత గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న షమీ.. లండన్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. చికిత్స తర్వాత కోలుకుంటున్నాడని భావించగా.. అతడి గాయం తిరగబెట్టినట్లు BCCI వర్గాలు తెలిపాయి. త్వరలో శస్త్రచికిత్స చేసుకునేందుకు లండన్ వెళ్లనున్నట్లు వెల్లడించాయి. దీంతో గుజరాత్ టైటాన్స్‌కు (Gujarat Titans) పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. ఎందుకంటే ఆ జట్టు రెండు సార్లు ఐపీఎల్ ఫైనల్‌కు వెళ్లడంలో షమీ కీలక పాత్ర వహించాడు.

వన్డే ప్రపంచకప్‌లో అదరగొట్టే ప్రదర్శన చేసిన పేసర్ మహ్మద్ షమీ.. ఐపీఎల్ 2024 టోర్నీకి దూరమయ్యాడు. గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు అభిమానులకు ఇది చేదువార్తే. గుజరాత్‌ టైటాన్స్‌ జట్టులో కీలక బౌలర్‌‌గా మహ్మద్ షమీ ఉన్నాడు. షమీ కొంతకాలంగా చీలమండ గాయంతో ఆటకు దూరంగా ఉన్నాడు. ఈ కారణంగానే స్వదేశంలో జరుగుతున్న భారత్ – ఇంగ్లాండ్ టెస్టు సరీస్‌కు దూరమయ్యాడు.

అయితే, విశ్రాంతి తీసుకుంటున్న షమీ కోలుకుంటున్నాడని అభిమానులు భావిస్తుండగా.. అతడి కాలి మడమకు సర్జరీ అవసరం కానుందని తాజాగా వార్తలు వెలువడుతున్నాయి. దీంతో త్వరలో ప్రారంభం కానున్న IPL టోర్నీ నుంచి షమీ వైదొలిగినట్లు BCCI వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ విషయాన్ని గుజరాత్‌ టైటాన్స్‌ ఫ్రాంచైజీ, ఐపీఎల్‌ వర్గాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. (Mohammed Shami)

ALSO READ: Mohammed Shami: పాండ్య లేక‌పోయినా వ‌చ్చే న‌ష్ట‌మేమీ లేదు

గుజరాత్ జట్టు రెండుసార్లు ఫైనల్‌కు చేరుకోవడంలో మహ్మద్ షమీ కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో అతడు ఆటకు దూరమవడం ఆ జట్టుకు పెద్ద దెబ్బే అవుతుంది. వన్డే వరల్డ్‌కప్ తర్వాత గాయంతో షమీ ఏ సిరీస్‌లోనూ ఆడకుండా విశ్రాంతి తీసుకుంటున్నాడు.

‘జనవరి చివరి వారమంతా షమీ.. లండన్‌లోనే ఉన్నాడు. ఎడమకాలి మడమకు అయిన గాయం తగ్గేందుకు కొన్ని ఇంజెక్షన్లు తీసుకున్నాడు. 3 వారాల తర్వాత కాస్త పరుగెత్తడం ప్రారంభించాడు. అయితే, అది పెద్దగా ఫలితాలను ఇవ్వకపోగా.. గాయం మళ్లీ తిరగబెట్టింది. దీంతో శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. త్వరలోనే అతడు మళ్లీ లండన్ వెళ్తాడు. ఐపీఎల్‌లో ఆడటం కష్టమే’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.IPL తర్వాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్ సిరీస్ లతో పాటు టీ20 వరల్డ్ కప్ కు కూడా షమీ దూరం కానున్నాడు. డిసెంబర్ లో ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్- గవాస్కర్ ట్రీఫీకి షమీ తిరిగి రావొచ్చని BCCI తెలిపింది.

ఈసారి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ ఎడిషన్‌ను రెండు దశల్లో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. మార్చి 22 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్‌ x రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Chennai Super Kings vs Royal Challengers Banglore) మధ్య చెన్నై వేదికగా తొలి మ్యాచ్‌ జరుగనుంది. తొలి 17 రోజులకు షెడ్యూల్ విడుదల చేశారు. ఎన్నికల తేదీలను బట్టి మిగతా షెడ్యూల్ ప్రకటిస్తామని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి.

ALSO READ: Mohammed Shami: BCCI చొర‌వ‌తో.. అర్జున అవార్డు రేసులో ష‌మీ..!

ఏప్రిల్- మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల కోసం అధికారులు, పోలీసులు విధులు నిర్వహిస్తారు. ఐపీఎల్ మ్యాచ్‌‌లు జరిగే స్టేడియాల్లో భద్రతా కోసం పోలీసుల అవసరం ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ ఐపీఎల్ మ్యాచ్‌‌లను 10 నగరాల్లో నిర్వహిస్తారు. చెన్నై, మొహలి, కోల్ కతా, జైపూర్, అహ్మదాబాద్, బెంగళూర్, హైదరాబాద్, లక్నో, విశాఖపట్టణం, ముంబైలో మ్యాచ్‌లు జరుగుతాయి.