Janasena: మంగళగిరిలో జనసేనాని మాస్టర్ ప్లాన్
Janasena: జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పర్యటనలకు YSRCP అడ్డంకులు సృష్టించడంతో మంగళగిరి జనసేన కార్యాలయంలో సేనాని చర్చలకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. శిక్షణా తరగతులతో పాటు అభ్యర్ధుల ఎంపికపై కూడా పవన్ కళ్యాణ్ కసరత్తులు చేస్తున్నారు. రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections) తెలుగు దేశం (Telugu Desam Party) జనసేన పొత్తు ద్వారా పవన్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ జిల్లాల ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పవన్ భీమవరం పర్యటనకు హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డంకులు కలిగించింది. దీంతో ఆయన ఆయా జిల్లాల నేతలను పార్టీ కార్యాలయానికి రావాలని ఆదేశాలు జారీ చేసారు. భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో చేపట్టాల్సిన సమావేశాలను మంగళగిరి కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత పవన్ రూట్ మ్యాప్ ఖరారు చేస్తారు. అభ్యర్ధుల ఎంపికపై కూడా పవన్ కసరత్తు చేస్తున్నారు.
ALSO READ: Nara Lokesh: అంబటి రాయుడుని ఎంతిస్తావ్ అని వేధించారు
పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన రద్దైన విషయం తెలిసిందే. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, ముఖ్య నాయకులతో ఆయన భేటీ కావాల్సి ఉంది. అందుకు తగ్గట్టు పార్టీ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. స్థానిక విష్ణు ఇంజినీరింగ్ కళాశాలలో హెలిప్యాడ్‌పై దిగాల్సి ఉంది. ఇందుకు యాజమాన్యం అనుమతి కూడా తీసుకున్నారు. కానీ అక్కడ అనువుగా ఉండదు అంటూ R&B అధికారులు అనుమతి నిరాకరించారు. దాంతో సేనాని పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అధికార ప్రభుత్వం దురుద్దేశంతోనే తనను పర్యటకు అనుమతించడంలేదని జనసైనికులు మండిపడ్డారు. దీంతో జిల్లాల నేతలతో మంగళగిరి ఆఫీస్‌లోనే పవన్ సమావేశాలు ఏర్పాటుచేసారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఇక్కడ పార్టీలు కులాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. మిగిలిన ఏ రాష్ట్రాల్లో లేని విధంగా ఇక్కడ రాజకీయాలు ఉంటాయి. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో మరోసారి రాజకీయ ఎత్తులు పైఎత్తులు మొదలైపోయాయి. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్ మోహన్ రెడ్డి శతవిధాలుగా ప్రయత్నిస్తుంటే జగన్ ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దించాలని తెలుగు దేశం, జనసేన పార్టీలు కంకణం కట్టుకున్నాయి.
ALSO READ: AP Elections: TDPకి జగన్ ఝలక్..!
అయితే.. గత ఎన్నికల్లో YCP TDP జనసేన ఒంటరిగా పోటీచేసాయి. దీంతో మూడు పార్టీల మధ్య ఓట్లు చీలిపోయాయి. ఈ చీలికలు అత్యధికంగా లాభపడింది వైసీపీ. గతంలో ఏ పార్టీకి రానన్ని సీట్లు వైసీపీకి వచ్చాయి. 151 సీట్లు 50 శాతం ఓట్లతో వైసీపీ ఘన విజయం సాధించింది. జనసేన తెలుగు దేశం పార్టీలు అప్పటివరకు కలిసి ఉండి చివరి నిమిషంలో విడిపోయాయి. ఇది ఆ రెండు పార్టీలకు తీరని నష్టాన్ని కలిగించింది. ఇక జనసేనాని పవన్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడించేందుకు చేయాల్సిన పనులు చేసేసారు. దీంతో ఈసారి అలా ఓట్లు చీలకుండా జాగ్రత్త పడాలని జనసేన తెలుగు దేశం పార్టీ డిసైడ్ అయ్యాయి. పొత్తులో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనేదానికి కావాల్సిన అన్ని సూచనలు కార్యకర్తలు, నేతలకు దిశానిర్దేశం చేసేస్తున్నారు.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే TDP, Janasena, BJP కూటమి అధికారంలోకి రావాలని ఏమాత్రం ఆలస్యం చేసినా వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే యువత భవిష్యత్తు అంధకరాంలో పడినట్లే అని పవన్, చంద్రబాబు నాయుడు తమ పార్టీ శ్రేణులకు చెప్తున్నారు. పార్టీ లైన్ దాటొద్దంటూ సుతిమెత్తంగా ముఖ్య నేతలను హెచ్చరిస్తున్నారు. పొత్తులో భాగంగా టికెట్ రాలేదని డీలా పడొద్దని అధికారంలోకి వస్తే పదవులు వస్తాయని హామీలు ఇస్తున్నారు.