Zaheer Khan: బుమ్రా ఏంటో అక్కడ తెలిసిపోతుంది
Zaheer Khan: హైదరాబాద్, విశాఖపట్నంలో ఉన్నట్లే రాజ్‌కోట్‌లో పిచ్ ఉంటుందని టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ అన్నాడు. రాజ్‌కోట్‌లో రివర్స్ స్వింగ్ కీలక పాత్ర పోషిస్తుందన్నాడు. జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), ఇంగ్లండ్ మిడిల్ ఆర్డర్ మధ్య హోరాహోరీ సమరం జరగబోతోందని ఇంగ్లీష్ మాజీ ఆటగాడు ఒవైస్ షా పేర్కొన్నాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో మ్యాచ్‌కు భారత్, ఇంగ్లండ్ సిద్ధమయ్యాయి. కీలకమైన మూడో టెస్టుకు ఇరు జట్లు వ్యూహ, ప్రతి వ్యూహాలతో పోటీకి దిగుతున్నాయి. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా గురువారం నుంచి మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
జియో సినిమాతో జహీర్ ఖాన్ మాట్లాడుతూ…‘హైదరాబాద్, వైజాగ్‌లో ఉన్న పిచ్‌ల మాదిరిగానే రాజ్‌కోట్ పిచ్ ఉంటుందని నేను ఆశిస్తున్నా. ఇలాంటి పిచ్‌పై తొలి రెండు రోజులు బ్యాటుకు, బంతికీ మధ్య మంచి పోటీని మనం చూడొచ్చు. అయితే మూడో రోజు స్పిన్ తిరుగుతుంది. కొంత రివర్స్ స్వింగూ అవుతుంది. నాలుగు, ఐదు రోజుల్లో స్పిన్నర్లు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు. ప్రేక్షకులు ఈ టెస్టును ఎంతో ఆస్వాదిస్తారు’ అని అన్నాడు.
జహీర్ ఖాన్ వ్యాఖ్యలతో మాజీ ఇంగ్లండ్ బ్యాటర్ ఒవైస్ షా ఏకీభవించాడు. జస్ప్రీత్ బుమ్రా మరియు ఇంగ్లండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌ల మధ్య హోరాహోరీ సమరం తప్పదు అని పేర్కొన్నాడు. ‘జస్ప్రీత్ బుమ్రా, ఇంగ్లండ్ మిడిల్ ఆర్డర్ మధ్య హోరాహోరీ సమరం జరగబోతోంది. ఎందుకంటే.. రాజ్‌కోట్‌లో బుమ్రా రివర్స్ స్వింగ్ చేయగలుగుతాడు. ఇదే జరిగితే ప్రేక్షకులందరు ఆనందిస్తారు. పాత బంతితో బౌలింగ్ చేస్తే ఇంగ్లండ్ బ్యాటర్లకు కష్టంగా మారుతుంది. బుమ్రా పరుగులు ఇవ్వకుండా వికెట్లు పడగొట్టడమే అందుకు కారణం’ అని ఒవైస్ షా చెప్పాడు.
రెండో టెస్టు ముగిసిన తర్వాత జహీర్ ఖాన్ భారత్ బ్యాటింగ్ ప్రదర్శనను గురించి మాట్లాడుతూ.. అసంతృప్తిని వ్యక్తం చేశారు. సిరీస్ ను భారత్ గెలవాలంటే దూకుడు, పోరాటం, ఆత్మవిశ్వాసం అవసరమని నొక్కి చెప్పాడు. ”ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనలను రోహిత్ బయటకు తీసుకురాగలిగాడని నేను అనుకుంటున్నాను. అయితే, జట్టును చూసినప్పుడు కొన్ని ఆందోళనలు వస్తున్నాయి. ముఖ్యంగా బ్యాటింగ్.. పిచ్ అనుకూలించే స్టేడియంలో రాణించలేకపోయారు.. ఇంతకుముందు ఇక్కడ భారత్ బ్యాటింగ్ లో మంచి ప్రదర్శనలు ఇచ్చింది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ను పరిశీలిస్తే ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేసి 300 పరుగులకు చేరువైంది. సమిష్టి కృషి అదే చేయగలదు. యశస్వి జైస్వాల్, శుభ్ బన్ గిల్ ఇద్దరు మాత్రమే భారత్ తరఫున అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడారు. అయితే, బ్యాటింగ్ లో మిగతా ప్లేయర్లు కూడా చేయాల్సింది చాలా ఉందని” జహీర్ ఖాన్ పేర్కొన్నాడు.
బౌలింగ్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్లు బంతితో అద్భుత స్పెల్స్ చేశారని జహీర్ ఖాన్ పేర్కొన్నాడు. బంతితో భారత్ విజయంలో కెప్టెన్ గా రోహిత్ పాత్ర ఎంతో ఉందని చెప్పాడు. అలాగే, బౌలింగ్ లోనూ జస్ప్రీత్ బుమ్రా ప్రతిభ ఉందని జహీర్ కొనియాడాడు. ఈ రకమైన ఉపరితలంపై, మీ స్పిన్నర్లు కొన్నిసార్లు ఒత్తిడిలో ఉన్నారని మీరు భావిస్తుంటారు.. కాబట్టి బౌలర్లకు ఇతర ప్లేయర్ల నుంచి సహాయం అవసరం. కాబట్టి, ఈ అంశాలన్నింటినీ నియంత్రించడానికి ఇక్కడ కెప్టెన్ చొరవను కొడియాడారు జహీర్ ఖాన్. రోహిత్ శర్మ బ్యాట్ తో రాణిస్తే తరువాతి మ్యాచ్ లకు ఫలితాలు మరింత అనుకూలంగా మారుతాయని పేర్కొన్నాడు.