Bharat Ratna అవార్డు ప్రకటించి వెనక్కి తీసుకున్న వేళ..!
Bharat Ratna: భారతదేశానికి చెందిన వివిధ రంగాల్లో అతి అద్భుతమైన సేవను, ప్రతిభను కనబరిచే వారికి కేంద్ర ప్రభుత్వం ఏటా కొన్ని బిరుదులతో సత్కరిస్తుంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) పద్మ విభూషణ్ (Padma Vibhushan) ప్రకటించింది. కొన్ని సంవత్సరాల ముందు ఆయనకు పద్మభూషణ్ వచ్చింది. ఈరోజు దివంగత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు (PV Narasimha Rao) భారతరత్నను ప్రకటించింది. భారత్‌కు చెందిన అన్ని అవార్డుల్లో గానూ భారతరత్న అనేది అత్యున్నతమైన అవార్డు. అయితే ఈ అవార్డులన్నీ ఎవరు తయారుచేస్తారు? ఎక్కడ తయారుచేస్తారు? ఎవరికి ఇస్తారు? వంటి ఆసక్తికరమైన అంశాల గురించి తెలుసుకుందాం.
అవార్డు ప్రకటించి వెనక్కి తీసుకున్న వేళ..!
1992లో సుభాష్ చంద్ర బోస్‌కు భారత ప్రభుత్వం భారత రత్నతో సత్కరించాలనుకుంది. కానీ ఆ నిర్ణయం పట్ల చాలా విమర్శలు వచ్చాయి. ఎందుకంటే బోస్ మరణం ఇప్పటికీ ఓ మిస్టరీనే. అందుకే ఆయన మరణంపై ఎందరో సినిమాలు తీయాలని చూస్తున్నారు. అలాంటి వ్యక్తికి భారతరత్న ఎలా ఇస్తారు అని పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అవార్డును వెనక్కి తీసేసుకున్నారు. భారతదేశ చరిత్రలో ఇలా అవార్డు ప్రకటించి వెనక్కి తీసుకోవడం అదే మొదటి, చివరి సారి.
కీలక అంశాలు
*1954లో భారతరత్నను ప్రవేశపెట్టారు. ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయుడు ప్రముఖ శాస్త్రవేత్త సీవీ రామన్
*భారతదేశపు అత్యుత్తమ బిరుదు భారతరత్న
*ఏటా భారతరత్న అవార్డులు ప్రకటించాలన్న నియమం ఏమీ లేదు. ఒకవేళ ప్రకటిస్తే ఒకే ఏడాదిలో కేవలం ముగ్గురికి మాత్రమే ప్రకటించాల్సి ఉంటుంది. తొలిసారి 1999లో నలుగురికి వరించింది.
*భారతరత్న అనేది కేవలం భారతీయులకు మాత్రమే ఇవ్వాలన్న నియమం ఏమీ లేదు.
*భారతదేశ గవర్నర్ జనరల్ అయిన సి. రాజగోపాలచారికి భారతరత్న వరించింది. ఆయన తర్వాత గవర్నర్ జనరల్ హోదాలో ఎవ్వరికీ భారతరత్న రాలేదు.
*భారతరత్న అవార్డు మెడల్ 59 mm పొడవు, 48 mm వెడల్పు, 3.2 mm మందంగా ఉంటుంది.
*1966 ముందు వరకు బతికున్నప్పుడే ఈ అవార్డును ప్రదానం చేసేవారు. 1966 నుంచి మరణానంతరం కూడా ప్రకటించడం మొదలుపెట్టారు.
*భారతరత్న అందుకున్న పిన్న వయస్కుడు మన క్రికెట్ గాడ్ సచిన్ తెందుల్కర్. 2014లో ఆయనకు ఈ అవార్డు వరించింది. క్రీడా రంగంలో సచిన్‌కి తప్ప మరే ఆటగాడికి కూడా ఈ బిరుదు దక్కలేదు.
ఈ అవార్డులు ఎక్కడ తయారుచేస్తారు?
భారతరత్న, పద్మభూషణ్, పద్మ విభూషణ్, పద్మశ్రీ, పరమవీర చక్ర అవార్డులన్నీ కూడా వెస్ట్ బెంగాల్ రాజధాని అయిన కలకత్తాలోని అలిపోర్ మింట్ ప్రాంతంలో తయారవుతాయి. 1952 మార్చి 19న అప్పటి ఆర్ధిక శాఖ మంత్రి సి.డి దేశ్‌ముఖ్ ఈ అలిపోర్ మింట్‌ను కట్టించారు. మెడల్స్‌కి కావాల్సిన అన్ని కాయిన్స్, ముద్రణలు ఇక్కడి నుంచే తయారవుతాయి.
మన భారతరత్నలు వీరే..!
సి.రాజగోపాలాచారి – 1954
డాక్టర్ ఎస్. రాధాకృష్ణన్ – 1954
డాక్టర్ సి.వి. రామన్ – 1954
డాక్టర్ భగవాన్ దాస్ – 1955
డాక్టర్ ఎం. విశ్వేశ్వరయ్య – 1955
Pt. జవహర్‌లాల్ నెహ్రూ – 1955
Pt. జి.బి. పంత్ – 1957
డా. ధోండో కేశవ్ కర్వే – 1958
డాక్టర్ బి. సి. రాయ్ – 1961
పురుషోత్తం దాస్ టాండన్ – 1961
డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ – 1962
డాక్టర్ జాకీర్ హుస్సేన్ – 1963
డా. పాండురంగ్ వామన్ కేన్ – 1963
లాల్ బహదూర్ శాస్త్రి (మరణానంతరం) – 1966
ఇందిరా గాంధీ – 1971
వి.వి. గిరి – 1975
కె. కామరాజ్ (మరణానంతరం) – 1976
మదర్ థెరిసా – 1980
ఆచార్య వినోబా భావే (మరణానంతరం) -1983
ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ – 1987
మరుదూర్ గోపాలన్ రామచంద్రన్ (మరణానంతరం) – 1988
బి.ఆర్. అంబేద్కర్ (మరణానంతరం) – 1990
నెల్సన్ మండేలా – 1990
రాజీవ్ గాంధీ (మరణానంతరం) – 1991
సర్దార్ వల్లభాయ్ పటేల్ (మరణానంతరం) – 1991
మొరార్జీ దేశాయ్ – 1991
మౌలానా అబుల్ కలాం ఆజాద్ (మరణానంతరం) – 1992
జె.ఆర్.డి. టాటా – 1992
సత్యజిత్ రే – 1992
గుల్జారీలాల్ నందా – 1997
అరుణా ఆసిఫ్ అలీ (మరణానంతరం) – 1997
డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం – 1997
కుమారి. సుబ్బులక్ష్మి – 1998
చిదంబరం సుబ్రమణ్యం – 1998
జయప్రకాష్ నారాయణ్ (మరణానంతరం) – 1999
ప్రొఫెసర్ అమర్త్య సేన్ – 1999
లోకప్రియా గోపీనాథ్ బోర్డోలోయ్ (మరణానంతరం) – 1999
Pt. రవిశంకర్ – 1999
లతా మంగేష్కర్ – 2001
ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ – 2001
Pt. భీంసేన్ జోషి – 2009
ప్రొఫెసర్ సి.ఎన్.ఆర్. రావు – 2014
సచిన్ టెండూల్కర్ – 2014
Pt. మదన్ మోహన్ మాలవీయ (మరణానంతరం) – 2015
అటల్ బిహారీ వాజ్‌పేయి – 2015