Yatra 2 Telugu Review: మమ్ముట్టి, జీవాల “యాత్ర” ఆకట్టుకుందా?
Yatra 2 Telugu Review: ఎన్నో అంచనాల మధ్య ఈరోజు యాత్ర 2 (yatra 2 ) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు మహి వి రాఘవ్ (Mahi V Raghav) తన సత్తాను యాత్రతో నిరూపించేసుకున్నారు. పొలిటికల్ బయోపిక్ కాబట్టి ఇతర పార్టీలకు భయపడి ఎవ్వరినీ కించపరచకుండా తీయాలనుకునే టైప్ కాదని యాత్ర 2తో మరోసారి ప్రూవ్ చేసుకున్నారు రాఘవ్. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) వారసుడిగా జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) 2019 ఎన్నికల సమయంలో చేసిన పాదయాత్ర నేపథ్యంలో యాత్ర 2 సినిమాను తెరకెక్కించారు రాఘవ్. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి (Mammootty) రాజశేఖర్ రెడ్డి పాత్రలో.. తమిళ నటుడు జీవా (Jiva) జగన్ మోహన్ రెడ్డి పాత్రల్లో నటించారు. కాదు కాదు.. ఒదిగిపోయారనే చెప్పాలి. సినిమాకు అన్ని వైపుల నుంచి మంచి టాక్ వినిపిస్తోంది.
చరిత్రలో ఎన్నో యుద్ధాలు భయంతో, బలగంతో గెలిచారు. కానీ ఒక్కడు మాత్రం సంకల్పంతో గెలిచాడు” ఈ డైలాగే యాత్ర 2..ఒక్కడి పంతమే యాత్ర 2. యాత్రలో కొందరిలాగా ఆయన కృష్ణుడు, దిగొచ్చాడు అంటూ అనవసరపు భజన చేయలేదు. ప్రత్యర్థులని టార్గెట్ చేసి తక్కువ చేసి నరరూప రాక్షసులుగా చిత్రీకరించలేదు. చెప్పాలనుకున్నది ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేసిన సినిమానే యాత్ర 2. జీవా జగన్ పాత్రకి ప్రాణం పోసాడు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పాత్రలో మహేష్ మంజ్రేకర్ (Mahesh Manjrekar) పరవాలేదనిపించారు. శుభలేఖ సుధాకర్ వచ్చిన ప్రతి సీను అద్భుతంగా వర్కవుట్ అయ్యింది. మమ్ముట్టి- జీవాకి మధ్య జరిగే సంభాషణలు ఆకట్టుకున్నాయి. తండ్రి కొడుకుల బంధాన్ని ప్రజలకు మరింత పరిచయం చేసినట్టు అనిపించింది.
సినిమా మొత్తం డ్రామా ఉండటం వల్ల కాస్త స్లోగా అనిపిస్తుంది. ప్రీ-క్లైమాక్స్ ఇంకాస్త బాగుండాల్సింది. ఇవి మినాహాయిస్తే సినిమా వైఎస్ఆర్ అభిమానులకి పండగే అని చెప్పాలి. సినిమాలో డైలాగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కెమెరా వర్క్, మ్యూజిక్ బాగున్నాయి. జగన్‌కి రాజకీయంగా మాత్రం ఈ సినిమా పెద్ద ప్లస్ అవుతుంది అనే చెప్పుకోవచ్చు. బహుశా అందుకేనేమో సినిమాపై తప్పుడు ప్రచారం చేయించాలని కొన్ని పార్టీలు ప్రయత్నించాయి. ఇప్పటివరకు యాత్ర 2కి పెద్దగా నెగిటివ్ రివ్యూలు అయితే రాలేదు. మహి వి రాఘవ్ ప్లానింగ్ చేసుకునే సమయంలోనే ఎక్కడా కూడా భజన కార్యక్రమాలు కానీ విమర్శలు చేసే పనులు కానీ చేయకూడదు అని కథను రాసిపెట్టుకున్నారు. అందుకే ఆయన పాదయాత్ర గురించి ప్రజలు రాజశేఖర్ రెడ్డి, జగన్‌ల గురించి ఏమనుకుంటున్నారో అది మాత్రమే చెప్పాలనుకున్నారు. మరో విషయం ఏంటంటే.. సీనియర్ ఎన్టీఆర్ (NTR) జీవితాధారంగా తెరకెక్కిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు కలిపి రాబట్టిన కలెక్షన్ల కంటే యాత్ర 2 కలెక్షన్లు డబుల్ ఉన్నాయి.
మరోపక్క దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తెరకెక్కించిన వ్యూహం (Vyooham) సినిమా ఈనెల 16న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించినదే. కాకపోతే వర్మ టేకింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏం జరిగిందో ఏం జరగబోతోందో చూపిస్తూనే అబ్బే అక్కడ ఏమీ లేదు ఎవ్వరికీ విమర్శించలేదు అని మాయ చేసేస్తాడు. యాత్ర 2 జగన్‌కు తప్పకుండా ఈసారి ప్లస్ పాయింట్ అవుతుంది అనిపిస్తోంది. ఇక వ్యూహం కూడా రిలీజ్ అయితే చంద్రబాబు నాయుడు ప్రజల్లో విలన్ అయిపోయే ప్రమాదం ఉంది. అందుకే నారా లోకేష్ (Nara Lokesh) తమపై తప్పుడు సన్నివేశాలతో వ్యూహం సినిమా తీసారంటూ తెలంగాణ హైకోర్టులో కేసు వేసారు. దాంతో రిలీజ్ అవ్వాల్సిన సమయంలో చేయలేకపోయారు. ఇప్పుడు కొన్ని సెన్సార్ కట్స్‌తో ఫిబ్రవరి 16న వ్యూహం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.