Yatra 2 Controversy: దర్శ‌కుడి మండిపాటు.. చంద్ర‌బాబుపై కామెంట్స్

Yatra 2 Controversy: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు (ap elections) దగ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్న సినిమా ఏదైనా ఉందంటే అది యాత్ర 2 (yatra 2). ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (jagan mohan reddy) 2019 ఎన్నిక‌ల‌కు ముందు చేసిన పాద‌యాత్ర నేప‌థ్యంలో ఈ సినిమాను మ‌హి వి రాఘ‌వ్ (mahi v raghav) తెర‌కెక్కించారు. (Yatra 2 Controversy)

ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. 2019లో వ‌చ్చిన యాత్ర (yatra) సినిమా కూడా ఇలాగే వివాదానికి దారి తీసింది. ఆ సినిమాలో దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి (ys rajasekhar reddy) చేసిన పాదయాత్ర కాన్సెప్ట్‌తో రాఘ‌వ్ సినిమా తీసారు. అప్ప‌ట్లో సినిమా బాగానే ఆడ‌టం మాత్ర‌మే కాదు.. ఓ ర‌కంగా ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ గెలుపుకు తోడ్ప‌డింది అని కూడా చెప్తుంటారు. వైఎస్సార్ చ‌నిపోయాక ఆయ‌న కుమారుడు జ‌గన్ ఎలా రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసారు? త‌న పాద‌యాత్ర‌తో ఎలా ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపున‌కు తిప్పుకున్నారు అనే అంశాల‌ను యాత్ర 2 సినిమాలో బ‌లంగా చూపించిన‌ట్లు ట్రైల‌ర్‌ను బ‌ట్టి తెలుస్తోంది.

రేపు యాత్ర 2 సినిమా రిలీజ్ అవుతున్న నేప‌థ్యంలో తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) నేత‌లు కార్య‌క‌ర్త‌లు తమకు మ‌ద్ద‌తు ఇచ్చే మీడియా వ‌ర్గాల ద్వారా సినిమాపై జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై త‌ప్పుడు ప్ర‌చారం చేయిస్తున్నార‌ట‌. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ్ ప్ర‌స్తావిస్తూ ప‌రోక్షంగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుపై (Chandrababu Naidu) ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. (Yatra 2 Controversy)

“బురద చల్లడం మన పని.
అది తుడుచుకుంటాడో, క‌డుక్కుంటాడో వాడి పని
నమ్మిచండయ్యా మన టీవి ఛానళ్ళు, న్యూస్
పేపర్స్ ఉన్నాయి కదా, లక్ష కోట్లు అని లక్ష
సార్లు చెప్పించండి, అదే నిజం అయిపోతుంది.
ఒక అబద్దాన్ని నిజం చేయాలంటే అది మీడియాకి మాత్రమే సాధ్యం”

అని మ‌హి వి రాఘ‌వ్ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ చ‌దివిన‌వారికి ఆయ‌న విమ‌ర్శించేంది చంద్ర‌బాబు నాయుడు, అత‌ని స‌న్నిహితులు, పార్టీ నేతలు, కార్య‌క‌ర్త‌ల‌నే అని చిన్న పిల్లాడికి కూడా క్లియ‌ర్‌గా అర్థ‌మ‌వుతుంది. యాత్ర సినిమా 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌ను ఎలా గెలిపించిందో యాత్ర 2 కూడా త్వ‌ర‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మోహన్ రెడ్డిని గెలిపించేస్తుందేమోన‌ని తెలుగు దేశం పార్టీ నేత‌లు ఆందోళ‌న చెందుతున్న‌ట్లు తెలుస్తోంది. అందుకే త‌ప్పుడు రాత‌లు, సినిమాపై దుష్ప్ర‌చారం చేయిస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

మరోప‌క్క యాత్ర‌కు కౌంట‌ర్‌గా చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌పై కొత్త‌గా రాజ‌కీయ అంశాల‌తో సినిమా ఏమీ తీయ‌లేదు కానీ.. ప‌వ‌న్ న‌టించిన కెమెరామ్యాన్ గంగ‌తో రాంబాబు (cameraman ganga tho rambabu) సినిమాను ఈరోజు రీరిలీజ్ చేయించారు. యాత్ర 2కి సెటైర్‌గానే ఈ సినిమాను రీరిలీజ్ చేయించాల‌ని జ‌న‌సైనికులు అభిప్రాయ‌ప‌డ్డార‌ట‌. (Yatra 2 Controversy)

ఇక యాత్ర సినిమా గురించి చెప్పాలంటే.. ఈ సినిమాలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాత్ర‌లో మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మ‌మ్ముట్టి (mammootty) న‌టించారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాత్ర‌లో ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు జీవా (jiva) న‌టించారు. ఈ సినిమాలో తెలుగు నటుల‌ను పెట్టి తీయాల‌నుకున్న‌ప్ప‌టికీ ఎవ్వ‌రూ ధైర్యం చేయ‌లేదు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని పోలి ఉన్న సాధార‌ణ వ్య‌క్తులు చాలా మందే ఉన్నారు కానీ వారు కూడా రాజ‌కీయ ప‌రంగా త‌మ‌కు ఎక్క‌డ ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయో అని న‌టించేందుకు ధైర్యం చేయ‌లేద‌ట‌. దాంతో రాఘ‌వ్ మ‌మ్ముట్టి, జీవా వంటి స్టార్ న‌టుల‌ను ఎంచుకున్నారు. (Yatra 2 Controversy)