YS Jagan Mohan Reddy పై చెప్పు విసిరిన ప‌వ‌న్ అభిమాని!

YS Jagan Mohan Reddy: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై.. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) అభిమాని చెప్పు విసిరారు. అయితే నేరుగా జ‌గ‌న్‌పై చెప్పు విస‌ర‌లేదు. అస‌లు ఏం జ‌రిగిందంటే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన కెమెరామ్యాన్ గంగ‌తో రాంబాబు (cameraman ganga tho rambabu) సినిమాను రీరిలీజ్ చేసారు. (YS Jagan Mohan Reddy)

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈ సినిమా ఓ థియేట‌ర్‌లో ఆడుతుండ‌గా.. ఎన్నిక‌లకు సంబంధించిన యాడ్ వేసారు. ఆ యాడ్‌లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌నిపించారు. దాంతో ఓ అభిమాని వెంట‌నే త‌న చెప్పు తీసి స్క్రీన్‌పై విసిరాడు. ఆ స‌మ‌యంలో  జై ప‌వ‌ర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ తెగ కేక‌లు, ఈల‌లు వేసారు. అయితే ఒక్క‌రు కూడా ఆ అబ్బాయిని నిల‌దీసింది లేదు. అభిమానం ఉండ‌టంలో త‌ప్పు లేదు కానీ మ‌రీ సినిమా థియేట‌ర్‌లో ఈ విధంగా ప్ర‌వ‌ర్తిస్తే ప‌వ‌న్ ఫ్యాన్స్ అంద‌రూ ఇంతే అన్న నింద‌లు వేస్తారు. చివ‌రికి అది ప‌వ‌న్‌ని అవ‌మానించేంత వ‌ర‌కు వెళ్తుంది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై చెప్పు విసురుతున్నప్పుడు ఓ వ్య‌క్తి వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో అది కాస్తా వైర‌ల్‌గా మారింది.

అయితే ఇక్క‌డ మ‌రో ఘ‌ట‌న చోటుచేసుకుంద‌ట‌. ప‌వ‌న్ అభిమాని చెప్పు విసిరిన‌ప్పుడు థియేట‌ర్ సిబ్బంది వెంటనే ఆ యువ‌కుడిని అదుపులోకి తీసుకుని పోలీసుల‌కు ప‌ట్టించారు. కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ అంతా క‌లిసి రచ్చ చేయ‌డంతో ఎన్నిక‌ల ముందు ఎందుకొచ్చిన గొడ‌వ‌లే అని వ‌దిలేసార‌ట‌. ఒక‌వేళ ఆ యువ‌కుడిని పోలీసులు స్టేష‌న్‌కు తీసుకెళ్ల‌డం అరెస్ట్ చేయ‌డం వంటివి చేసుంటే క‌చ్చితంగా లా అండ్ ఆర్డ‌ర్ స‌మ‌స్య వ‌చ్చేది. (YS Jagan Mohan Reddy)

ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఎంత కోప‌మైనా ఉండొచ్చు. కానీ మ‌రీ ఈ రేంజ్‌లో అన‌వ‌స‌రంగా ప‌వ‌న్ పేరుని కూడా చెడ‌గొట్టే ప‌నులు చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బో వారు కూడా అర్థంచేసుకుని మ‌సులుకోవాలి. సినిమాలు వేరు రాజ‌కీయాలు వేరు. రాజ‌కీయంగా ప్ర‌జ‌ల‌కు తెలీకుండా చాలానే జ‌రుగుతుంటాయి. అన‌వ‌స‌రంగా సినిమాల‌ను రాజ‌కీయాల‌ను క‌లిపి చూడ‌టం.. నేత‌ల‌పై చెప్పులు విస‌రడం వారిని తిడుతూ వీడియోలు, రీల్స్ చేయ‌డం వంటివి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ YSRCP ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ప్ర‌త్య‌క్షంగా కానీ ప‌రోక్షంగా కానీ కామెంట్స్ చేసేవారిని ఆ పార్టీ నేత‌లు ఎలా ఆడేసుకుంటున్నారో చూస్తున్నాం. వారిపై కేసులు పెట్టి వారి ఇళ్లు కూల్చేయించిన ఘ‌ట‌న‌లు కూడా చూసాం.

ఇదే విష‌యాన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా త‌న ఫ్యాన్స్‌కి అర్థ‌మ‌య్యేలా చెప్తే బాగుంటుంది. ఎందుకంటే చెప్పు విసిరిన ఆ యువ‌కుడిని పోలీసులు అరెస్ట్ చేసిన‌ప్పుడు ఆ త‌ర్వాత ఏమైనా జ‌రిగి ఉండొచ్చు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలు ఎలా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. త‌న సోద‌రిని గూండాలు ఏడిపిస్తున్నార‌ని అమ‌ర్నాథ్ అనే బాలుడిని నిప్పు పెట్టి చంపేసిన ఘ‌ట‌న ఇంకా మ‌ర్చిపోలేక‌పోతున్నాం. ఇంత ఘోరానికి పాల్ప‌డిన నిందితుడు హ్యాపీగా బెయిల్‌పై బ‌య‌ట తిరుగుతున్నాడు. ఫ్యాన్స్ అత్యుత్సాహానికి పోయి చిక్కుల్లో ప‌డితే ఆ త‌ర్వాత కాపాడ‌టానికి ఎవ్వ‌రూ రారు అనే విష‌యాన్ని గుర్తుపెట్టుకుని మ‌సులుకోవాలి. ఏద‌న్నా జ‌ర‌గ‌రానిది జ‌రిగితే నేత‌లైనా హీరోలైనా ప‌రామ‌ర్శించేందుకు వ‌స్తారే త‌ప్ప కాపాడ‌టానికి కాదు అనే విష‌యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్ప‌టికైనా ఏ పార్టీ అభిమానులు అయినా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇలాంటి ర‌చ్చ‌ల‌కు పాల్ప‌డ‌కుండా ఉంటే బాగుంటుంది. (YS Jagan Mohan Reddy)