Rose Day: ఆమె రక్తపు కన్నీరే.. గులాబీలుగా మారాయా?
Rose Day: వ్యాలెంటైన్ వీక్ మొదలైపోయింది. ఈరోజు రోజ్ డే. ప్రేమికులు ఒకరికొకరు గులాబీలు ఇచ్చి పుచ్చుకుని తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. అయితే గులాబీ అనగానే మనకు ఎరుపు రంగు గులాబీ మాత్రమే గుర్తొస్తుంది. రెడ్ రోజ్ ప్రేమకు చిహ్నం అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ గులాబీల గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. (rose day)
ఆమె కన్నీరే గులాబీ
గ్రీక్ మిథాలజీ ఆఫ్రోడైట్ (ది గాడెస్ ఆఫ్ లవ్) ప్రకారం తన ప్రియుడు అడోనిస్ కోసం ఎర్రటి బిందువుల కన్నీరుగార్చిందట. ఆ కన్నీటి బిందువులే గులాబీలుగా మారాయి అని చెప్తుంటారు.
గులాబీలు అత్యంత పురాతన పువ్వులు
గులాబీలు అనేవి అత్యంత పురాతనమైన పూలలో ఒకటి. అందుకే కొన్ని దశాబ్దాల క్రితం సంగీతం, సాహిత్యంలో గులాబీల గురించి ప్రస్తావించారు. పురావస్తు శాఖ అధికారులు ఈ గులాబీలను 35 మిలియన్ ఏళ్ల క్రితమే గుర్తించారట. అత్యంత పురాతనమైన ఈ ఎర్ర గులాబీ వయసు 1000 ఏళ్ల పైనే ఉంటుందట.
గులాబీలను తింటారు కూడా..!
గులాబీ పూలను తింటారన్న విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. గుల్కంత్ అనే స్వీటెనర్‌లో తేనెను ఉపయోగించి గులాబీ రేకలను వేసి మరీ తయారు చేస్తారు. ఇది తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోజ్ హిప్స్ అనే పండ్లు కూడా దొరకుతాయి. వీటిలో విటమిన్ సి అధికరంగా ఉంటుంది. ఇండియన్, చైనీస్ కిచెన్లలో ఈ గులాబీ పువ్వులు, పండ్లను బాగా ఉపయోగిస్తారు. అలాగని నేరుగా పువ్వుల కోసి.. బొకేల నుంచి పీకి తినేయడం వంటివి అస్సలు చేయకండి. వాటిపై పురుగుల మందులు చల్లి అమ్ముతుంటారు. (rose day)
గులాబీ లేని పెర్ఫ్యూం లేదు
గులాబీ లేని పెర్ఫ్యూం లేదంటే నమ్ముతారా? ఎన్నో అంతర్జాతీయ బ్రాండ్స్ అ గులాబీల నుంచి వదజల్లే సువాసనలను తమ పెర్ఫ్యూంలను తయారుచేసేందుకు వాడుతుంటారు. ఫ్రాగ్రన్స్ పరిశ్రమల్లో రోజ్ ఆయిల్ అనేది ముఖ్యమైన పదార్థం అట. లక్షలు, కోట్లు ఖర్చు పెట్టైనా ఈ ఆయిల్‌ను తెప్పించి పెర్ఫ్యూంలు తయారుచేసేందుకు వాడుతుంటారు. ఇంత ఖరీదు ఎందుకంటే రోజ్ ఆయిల్ అనేది ఏదో రెండు పువ్వుల నుంచి తీస్తే వచ్చేది కాదు. రెండు గ్రాముల రోజ్ ఆయిల్ కావాలంటే 2000 పువ్వులను వాడాల్సి ఉంటుంది.
రోజా రంగులు.. వివిధ అర్థాలు
రోజాల్లో ఎన్నో రకాల రంగులు ఉన్నాయి. ప్రతి రంగుకి ఓ అర్థం ఉంటుంది.
ఎరుపు – ప్రేమ, రొమాన్స్
పింక్ – దయ, గాంభీర్యం
పసుపు – ఫ్రెండ్షిప్
తెలుపు – ప్రశాంతత
అమెరికా జాతీయ పుష్పం
ఈ గులాబీ అమెరికాకు జాతీయ పుష్పం. 1986లో అప్పటి అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ గులాబీని అమెరికా జీతయ పుష్పంగా ప్రకటించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ అమెరికాలో గులాబీలను పండించిన తొలి వ్యక్తట. ఓ గులాబీ రకానికి తన తల్లి మేరీ వాషింగ్టన్ పేరుని పెట్టారు కూడా.
అంతరిక్షంలోకి గులాబీ
ప్రపంచంలోనే అతిచిన్న రోజా పువ్వుకి ఓవర్‌నైట్ సెన్సేషన్ అనే పేరుంది. దీనిని వ్యోమగాములు అంతరిక్షంలోకి తీసుకెళ్లి గులాబీ పరిమళం పైన ఎలా ఉంటుంది అనే అంశంపై రీసెర్చ్ చేసారు.
మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. నీలం, నలుపు రంగుల్లో అసలు గులాబీలే ఉండవట. వాటిపై ఆర్టిఫిషియల్ రంగుల చల్లి అమ్మేస్తుంటారు కానీ అలాంటి గులాబీలను ఎవ్వరూ పెంచలేరట.