Vastu: ఇల్లు ద‌క్షిణం వైపుంటే మంచిది కాదా?

Vastu: ఇంటి నిర్మాణం విష‌యంలో వాస్తు శాస్త్రం ఎంతో కీల‌కం. వాస్తు శాస్త్రాన్ని బ‌ట్టి ఏది ఏ వైపు ఉండాలి అని ద‌గ్గ‌రుండి మ‌రీ క‌ట్టించుకుంటూ ఉంటారు. వాస్తు దోషం ఉంటే ఎంత మంచి ఇల్లు క‌ట్టించుకున్నా సంతోషం అనేది ఉండ‌దు. అయితే చాలా మందికి ఉండే అనుమానం ఏంటంటే.. ఇంటి నిర్మాణం ద‌క్షిణం వైపు ఉంటే మంచిదా? కాదా? అని. అస‌లు వాస్తు శాస్త్రం ఏం చెప్తోందో తెలుసుకుందాం. (vastu)

ద‌క్షిణం వైపు నిర్మించిన ఇళ్ల‌పై సూర్య కిర‌ణాలు ప‌డ‌వ‌ని అది అశుభ‌మ‌ని దీని వ‌ల్ల ఇల్లు చీక‌టిగా.. అస‌లు నివ‌సించ‌డానికే వీలు లేకుండా ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. దీని వ‌ల్ల వ్య‌క్తిగ‌త‌, ఆర్థిక ఇబ్బందులు కూడా వ‌స్తాయని న‌మ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం కూడా ఇదే చెప్తోంది. ద‌క్షిణం వైపు క‌ట్టించిన ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక, వైవాహిక ఇబ్బందులు ఎదుర‌వుతూ ఉంటాయ‌ట‌. అయితే ద‌క్షిణం వైపు ఇల్లు క‌ట్టుకుంటే అన్నీ క‌ష్టాలే ఉంటాయి అనేవారి మాట‌లు అస్స‌లు న‌మ్మ‌ద్ద‌ని అంటున్నారు ప్ర‌ముఖ వాస్తు శాస్త్ర నిపుణుడు పినాక పాల్. ద‌క్షిణం వైపు ఇల్లు క‌ట్టుకున్నా కూడా పాటించాల్సిన వాస్తు రూల్స్ పాటిస్తే ఎలాంటి దోషాలు ద‌రిచేర‌వు అని చెప్తున్నారు. (vastu)

చాలా మందికి ఇల్లు క‌ట్టించుకునే స్థోమ‌త ఉంటుంది కానీ వాస్తు ప్ర‌కారం క‌ట్టించుకోవ‌డం వీలు ప‌డ‌దు. వాస్తు దోషం ఉన్నా లేక‌పోయినా ఉండ‌టానికి ఓ ఇల్లు ఉంటే చాలు అనుకునేవారు చాలా మంది ఉన్నారు. మ‌రి అలాంటివారికి ఇల్లు ద‌క్షిణం వైపు ఉన్నా అది దేవాల‌యంతో స‌మానం క‌దా..! వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఇల్లు ఏ వైపున నిర్మించాల‌నుకున్నా కూడా ఆ దిశ‌కు సంబంధించిన దేవుడి బొమ్మ పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ద‌క్షిణం వైపు నిర్మించిన ఇళ్లు అన్ని వ‌ర్గాల వారికి మంచి చేస్తాయ‌ని చెప్ప‌లేం. అలాంటి ఇంట్లో ఉండాల‌నుకునేవారి జాత‌కం, వృత్తి ప్ర‌కారం అలాంటి ఇంట్లో ఉండ‌చ్చా లేదా అని చూసుకోవాలి.

ద‌క్షిణానికి అధిప‌తి కుజుడు (mars). అంటే రియ‌ల్ ఎస్టేట్, హెల్త్ ఇండ‌స్ట్రీలో ప‌నిచేసేవారికి ఈ ద‌క్షిణం వైపు ఇళ్ల‌ల్లో నివ‌సించేందుకు వీలుగా ఉంటుంది. అంతేకాదు.. సినిమా రంగం వారికి కూడా దక్షిణం బాగా క‌లిసొస్తుంది.

ద‌క్షిణం దిశ‌గా క‌ట్టించిన ఇళ్ల‌ల్లో ఏ వృత్తివారు ఉండొచ్చు?

పోలీసులు, లాయ‌ర్లు

ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగులు

మిలిట‌రీ, పారామిలిట‌రీ ఉద్యోగులు

సెక్యూరిటీ, బాడీగార్డ్ స‌ర్వీస్ వ‌ర్క‌ర్లు

ఫ్యాక్ట‌రీ ఓన‌ర్లు

త‌యారీ ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన ఓన‌ర్లు

యాక్ట‌ర్లు, సంగీత ద‌ర్శ‌కులు, ఇత‌ర వినోద రంగానికి చెందిన‌వారు

ప్రాప‌ర్టీ డీల‌ర్లు

డాక్ట‌ర్లు, న‌ర్సులు