NTR in Kalki: క‌ల్కిలో తార‌క్, నాని..!

NTR in Kalki: రెబెల్ స్టార్ ప్ర‌భాస్ (prabhas) న‌టిస్తున్న క‌ల్కి 2898 AD సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇందులో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (jr ntr), నేచుర‌ల్ స్టార్ నాని (nani) కేమియో రోల్స్‌లో న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

కృపాచార్య‌, ప‌ర‌శురాముడి పాత్ర‌ల్లో?

క‌ల్కి సినిమాలో నాని కృపాచార్య పాత్ర‌లో.. తార‌క్ ప‌ర‌శురాముడి పాత్ర‌ల్లో క‌నిపిస్తార‌ని టాక్ ఉంది. సినిమాలో విజయ్ దేవ‌ర‌కొండ (vijay devarakonda) కూడా ఉన్నార‌ని కూడా విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. క్లైమాక్స్ సీక్వెన్స్ సీన్ల‌లో నాని, తార‌క్ క‌నిపిస్తార‌ట‌. దీని గురించి టీం స్పందించాల్సి ఉంది.

మే 8న రానున్న క‌ల్కి

నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మే 8న రిలీజ్ కాబోతోంది. ఇందులో దీపిక ప‌దుకొణె, దిశా ప‌టానీ, క‌మ‌ల్ హాస‌న్‌లు కూడా కీ రోల్స్‌లో న‌టిస్తున్నారు. మ‌హాభార‌తంలోని క‌ల్కి అవ‌తార అంశాన్ని తీసుకుని దానిని తెరపై ఆవిష్క‌రించ‌నున్నారు నాగ్ అశ్విన్.