War 2: రిస్క్‌లో హృతిక్, తారక్ సినిమా
War 2: బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ (hrithik roshan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (jr ntr) కలిసి నటించనున్న వార్ 2 సినిమా కాస్త రిస్క్‌లో పడినట్లు అనిపిస్తోంది. షారుక్ ఖాన్ నటించిన పఠాన్ సక్సెస్ తర్వాత దేశంలో స్పై యూనివర్స్ ఫ్రాంచైస్‌కు బాగా పాపులారిటీ దక్కింది. దాంతో సల్మాన్ ఖాన్ (salman khan) కూడా తన టైగర్ 3 (tiger 3) సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకున్నారు. ఎందుకంటే ఇది కూడా స్పై యూనివర్స్ ఫ్రాంచైస్‌కు చెందిన సినిమానే. కానీ అది అట్టర్ ఫ్లాప్ అయింది. (war 2)
నిరాశపరిచిన ఫైటర్
ఇటీవల హృతిక్ రోషన్, దీపిక పదుకొణె (deepika padukone) నటించిన ఫైటర్ (fighter) సినిమా రిలీజ్ అయింది. అయితే హృతిక్ రోషన్ కెరీర్‌లోనే తక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమా ఇదే అని అంటున్నారు. దాంతో ఇప్పుడు చర్చ మొత్తం వార్ 2 (war 2) సినిమా చూట్టూ తిరుగుతోంది. ఎందుకంటే వార్ 2 సినిమా కూడా స్పై యూనివర్స్‌కి చెందినదే. దాంతో వార్ 2కి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండకూడదని టీం తెగ టెన్షన్ పడుతోంది.
వార్ 2 టెన్షన్
ఇక స్పై యూనివర్స్ సినిమాలు థియేటర్లలో ఆడవేమో అని వార్ 2 టీం భయపడుతోంది. అందులోనూ తారక్‌కు ఇది తొలి హిందీ చిత్రం. హృతిక్ రోషన్ సంగతి పక్కన పెడితే ఈ సినిమా వల్ల తారక్‌కు చెడ్డ పేరు వస్తే మాత్రం ఫ్యాన్స్ ఏ రేంజ్‌లో ఆడుకుంటారో ఆల్రెడీ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాతో చూపించేసారు. ఇక తారక్ ఫ్యాన్స్ అప్‌సెట్ అయితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇవన్నీ మైండ్‌లో పెట్టుకుని టీం చాలా శ్రద్ధంగా స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.