శనివారం రోజున ఇవి పొరపాటున కూడా కొనకూడదట
శనివారం (saturday) రోజున కొన్ని వస్తువులను అస్సలు కొనకూడదట. తెలీక కొన్నా సమస్యలు తప్పవు. శని దేవునికి సంబంధించిన రోజు కాబట్టి ఆయన ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అంతేకాదు… జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శనివారాన్ని అశుభంగా భావిస్తుంటారు. అలాగని శనిదేవుడిని (lord shani) తిట్టుకోకండి. ఆయన చేసిన కర్మకు ఫలితాలను అందిస్తారు. నిజానికి శనిదేవుడు మనకు నేర్పే పాఠాలు ఎన్నో..! అసలు శనివారం పూట కొనకూడని వస్తువులు ఏంటో చూద్దాం.
నూనె (oil)
శనివారం పూట అస్సలు నూనెలు కొనకూడదు. అందుకే ఎప్పుడైనా ఇంట్లో నూనె నిండుకున్నా ఒక పూట నూనె లేకుండా వండుకుంటారు కానీ ఆ రోజున మాత్రం అస్సలు కొనుగోలు చేయరు. శనివారాల్లో నూనె కొంటే తీవ్ర అనారోగ్య సమస్యలు వెంటాడతాయట.
ALSO READ: Vastu: ఈ వస్తువులు ఇంట్లో ఉంటే అరిష్ఠం..!
చీపురు (broom)
శనివారం రోజున చీపుర్లు కూడా కొనుగోలు చేయరు. శనివారాలనే కాదు మంగళవారాలు కూడా చీపుర్లు కొనుగోలు చేయకూడదు. ఇలా చేస్తే పేదరికం దాపరించే ప్రమాదం ఉంటుంది. మంగళవారాల్లో చీపురు కొంటే లక్ష్మీ దేవికి అస్సలు నచ్చదట.
నల్ల చెప్పులు (black shoes)
శనివారాల్లో నల్ల చెప్పులు కొనుగోలు చేయడం కూడా అశుభమే. శనివారాల్లో నల్ల చెప్పులు కానీ బూట్లు కానీ వేసుకుని ఆఫీసులకు వెళ్తే ఉద్యోగాలు పోయే రిస్క్ ఉంటుందట.
ఉప్పు (oil)
శనివారాల్లో ఉప్పు కొనుగోలు చేస్తే ఆర్థికంగా చితికిపోతారు. అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం కూడా ఉంది.
ALSO READ: Vastu: గడియారం ఏ వైపు పెడితే మంచిది?
ఉప్పు (salt)
శనివారాల్లో ఉప్పు కొనుగోలు చేస్తే ఆర్థికంగా చితికిపోతారు. అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం కూడా ఉంది. అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు.
సిరా (ink)
శనివారాల్లో సిరా కూడా కొనుగోలు చేయకూడదట. ముఖ్యంగా విద్యార్ధులు పరీక్షల సమయంలో శనివారాల్లో సిరాను కొనుగోలు చేయడం వంటివి అస్సలు మంచిది కాదు. చదువుల విషయంలో వెనుకబడిపోతారు.