Viral News: ప్రాణం కాపాడాడు.. ఉద్యోగం కోల్పోయాడు..!

Viral News: ఓ వ్య‌క్తి ప్రాణాలు కాపాడి మ‌రో వ్య‌క్తి త‌న ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగిందో తెలీదు కానీ పాపం స‌ద‌రు వ్య‌క్తి రెడిట్ యాప్‌లో త‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని వివ‌రిస్తూ పోస్ట్ పెట్టాడు.

కిరాద్ అనే వ్య‌క్తి రోజూ లాగే యూనిఫాం వేసుకుని ఆఫీస్‌కు ట్రైన్‌లో బ‌య‌లుదేరాడు. ఆ స‌మ‌యంలో త‌న ఎదురుగా ఉన్న వ్య‌క్తి ఉన్న‌ట్టుండి కుప్ప‌కూలిపోయాడు. దాంతో అత‌ని యూనిఫాం పాడైపోయినా ఫ‌ర్వాలేదు అనుకుని ప్రాణాలు కాపాడాడు. ఆ త‌ర్వాత పోలీసులు, వైద్య సిబ్బంది వ‌చ్చి అత‌న్ని హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ఈ వివ‌రాల‌న్నీ పోలీసుల‌కు ఇచ్చేస‌రికి కిరాద్ ఆఫీస్‌కు రెండు గంట‌లు లేట్‌గా వెళ్లాల్సి వ‌చ్చింది.

జ‌రిగిన విష‌యం చెప్తే త‌న మేనేజ‌ర్ కూడా పాజిటివ్‌గానే స్పందిస్తాడు అనుకున్నాడు. కానీ పాపం అలా జ‌ర‌గ‌లేదు. కిరాద్ ఆఫీస్‌కి వెళ్ల‌గానే హెచ్ఆర్ నుంచి పిలుపు వ‌చ్చింది. ఎందుకు ఆల‌స్యం అయ్యిందో కిరాద్ వివ‌రించి అన్ని ఆధారాలు చూపించాడు కూడా. అయినా వారు ఒప్పుకోలేదు. కంపెనీ యూనిఫాం వేసుకుని మ‌రో వ్య‌క్తికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడినందుకు ఉద్యోగం నుంచి తీసేస్తున్నామ‌ని.. ఇలాంటి ప‌నులు చేస్తే కంపెనీ పేరు పోతుంద‌ని కార‌ణం చెప్పి పాపం అత‌న్ని ఇంటికి పంపించేసారు. ఇందులో త‌న త‌ప్పు ఏముందో ఇప్ప‌టికీ అర్థంకావ‌డంలేదు అంటూ కిరాద్ ఎంతో బాధ‌ప‌డ్డాడు. కిరాద్‌కు మంచి ఉద్యోగం దొర‌కాలని మ‌నం ఆశిద్దాం.