EXCLUSIVE: పొత్తు ఖాయమైనట్లే.. సీట్లు ఆశిస్తోంది వీరే..!
EXCLUSIVE: ఏపీ ఎన్నికల్లో (ap elections) తెలుగు దేశం పార్టీ (TDP), జనసేన (janasena) కలిసి బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగు దేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ముందు జనసేన భారతీయ జనతా పార్టీతో (BJP) పొత్తులో ఉంది. వారితో పొత్తులో ఉండగానే కనీసం సంప్రదింపులు జరపకుండా చంద్రబాబు నాయుడుకు (chandrababu naidu) మద్దతు ఇస్తున్నట్లు పవన్ (pawan kalyan) ప్రకటించేసారు.
దాంతో BJP అయోమయంలో పడిపోయింది. ఏపీలో పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగే ధైర్యం చేయలేదు. దాంతో ఇక చచ్చినట్లు తెలుగు దేశం, జనసేనతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాదు కొందరు నేతలు ఇప్పటినుంచే తమకు కావాల్సిన సీట్లను ఏరుకుని మరీ పెట్టుకున్నారట. విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ లైన్లో ఉన్నారు. కానీ విశాఖ తూర్పు, ఉత్తర స్థానాలు తెలుగు దేశం పార్టీకి సిట్టింగ్ స్థానాలు కాబట్టి తెలుగు దేశం పార్టీ వాటిని BJP కోసం త్యాగం చేస్తుందా? లేదా అనేది చూడాలి.
సీట్లు ఆశిస్తున్న ఇతర నేతలు
రాజమండ్రి లోక్సభ – పురంధేశ్వరి
రాజమండ్రి సిటీ – సోము వీర్రాజు
పి.గన్నవరం – మానేపల్లి అయ్యాజీవేమ
కైకలూరు – కామినేని శ్రీనివాస్
తిరుపతి – భాను ప్రకాశ్ రెడ్డి
మదనపల్లె – చల్లపల్లి నరసింహా రెడ్డి
శ్రీకాళహస్తి – కోలా ఆనంద్
గుంటూరు పశ్చిమ – వల్లూరి జయప్రకాశ్ నారాయణ, పోతూరి నాగభూషణం