ఈ టాప్ 3 కంపెనీల్లో ఉద్యోగం ఇక‌ మంచిది కాదు

Google: గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి కంపెనీల్లో వ‌ర్క్ చేయాల‌ని కోరుకోని వారు ఉండ‌రు. ఒక‌ప్పుడు ఈ మూడు కంపెనీలు ఉద్యోగం చేయ‌డానికి బెస్ట్. కానీ ఇప్పుడు వీటిలో ఉద్యోగం చేయ‌డం ఎంత మాత్రం మంచిది కాద‌ని ఓ నివేదిక చెప్తోంది. 2024లో టాప్ 100 కంపెనీల జాబితాలో ఈ మూడు కంపెనీల ర్యాంకింగ్ ప‌డిపోయింది. గూగుల్ ర్యాంకింగ్ 8 నుంచి 26 ప‌డిపోగా, మైక్రోసాఫ్ట్ 13 నుంచి 18కి ప‌డిపోయింది. ఇక మెటా అయితే టాప్ 100 కంపెనీల్లో స్థానాన్నే కోల్పోయింది. ఇందుకు కార‌ణం ఇటీవ‌ల కాలంలో భారీగా జ‌రిగిన లేఆఫ్‌లే.