AP Elections: TDPలో దూరాల‌ని చూస్తున్న YCP నేత‌లు.. లోకేష్ స్కెచ్ ఏంటి?

AP elections: రానున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీ (TDP) జ‌న‌సేన (janasena) క‌లిసి బ‌రిలోకి దిగుతున్నారు కాబ‌ట్టి వారికే మెజారిటీ ఓట్లు పడేలా ఉన్నాయ‌ని కొంద‌రు YCP నేత‌లు ముందే ఊహించేసుకుంటున్నారు.

YCPలో ఉన్న నేత‌ల్లో కొంద‌రు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై, దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి తండ్రిపై ఉన్న అభిమానంతో ఉంటే.. అధికార పార్టీ కాబ‌ట్టి స‌పోర్ట్ చేస్తున్న‌వారు కొంద‌రు. ఈ రెండో కోవ‌కు చెందిన‌వారు.. ముందే ఓట‌మిని ఊహించేసుకుని మెల్లిగా జ‌న‌సేన‌, తెలుగు దేశం పార్టీల్లోకి జంప్ అవ్వాల‌ని ప్లాన్లు వేస్తున్న‌ట్లు ఇన్‌సైడ్ టాక్.

ఇప్ప‌టికే కొంద‌రు YCP అస‌మ్మ‌త నేత‌లు తెలుగు దేశం పార్టీ కండువా క‌ప్పుకున్నారు. YCP ఎమ్మెల్సీ అయిన వంశీకృష్ణ జ‌నసేన‌లోకి వెళ్లే అవ‌కాశం ఉంద‌ని టాక్ న‌డుస్తోంది. అయితే తెలుగు దేశం పార్టీలోకి రావాల‌నుకునే అంద‌రు YCP నేత‌ల‌కు అనుమ‌తి లేదు. నారా లోకేష్ (nara lokesh) ఈ విష‌యంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు. వ‌చ్చిన ప్ర‌తి ఒక్కరినీ పార్టీలో చేర్చుకోబోమ‌ని TDP పార్టీ నేత‌ల‌తో అన్నార‌ట‌. మీ పార్టీలో చేర‌తాం అన్నా అని ఎవ‌రైనా ఫోన్లు చేసినా వారి గురించి ముందు త‌న‌తో, చంద్ర‌బాబు నాయుడుతో చ‌ర్చించాల‌ని ఆదేశించార‌ట‌.