Ankita Lokhande: బిగ్‌బాస్‌లో నటుడు సుశాంత్ రొమాన్స్ గురించి చర్చ.. ఇంత నీచమా?
Ankita Lokhande: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (sushanth singh rajput) 2020లో ఆత్మహత్య చేసుకుని యావత్ భారతదేశాన్ని షాక్‌కు గురిచేసారు. అప్పట్లో సుశాంత్.. టీవీ నటి అంకిత లోఖాండేతో ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత ఆమెతో బ్రేకప్ అయ్యి నటి రియా చక్రవర్తిని డేటింగ్ చేసారు. ఇదంతా జరిగిపోయిన విషయం. కానీ ఇప్పుడు అంకిత హిందీ బిగ్‌బాస్‌లో పాల్గొన్నారు. షో సమయంలో సుశాంత్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఫేమస్ అవ్వాలనుకుంటున్నారు.
ఆయన ఆత్మహత్యపై ఇంకా కేసు నడుస్తున్న సమయంలో అంకిత సుశాంత్ ఎలా చనిపోయాడో తనకు తెలుసు అంటూ బిగ్‌బాస్ షోలో కామెంట్స్ చేస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్లో ఇంకా దిగజారిపోయి మాట్లాడారు. సుశాంత్ చేసిన సినిమాల్లో చాలా మంది హీరోయిన్లతో లిప్ కిస్ సీన్లలో నటించాడని.. సెక్స్ సీన్లను కూడా చూసి తానెంతో ఏడ్చేదానినని పేర్కొన్నారు. అసలు బిగ్‌బాస్ షోలో చనిపోయిన సుశాంత్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అంకితకు విక్కీ జైన్ అనే వ్యాపారవేత్తో వివాహం అయ్యింది. అతను కూడా బిగ్‌బాస్‌లో ఉన్నాడు. భర్త ఉండగానే సుశాంత్‌తో చేసిన రొమాన్స్ గురించి మాట్లాడటం ఎంత వరకు కరెక్టో వారికే తెలియాలి.