మనవాళ్లను వదిలిపెట్టేందుకు ఖతార్ పరోక్ష డిమాండ్స్ ఇవేనా?
Qatar: గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలతో భారత్‌కు చెందిన ఎనిమిది మంది నేవీ అధికారులకు ఖతార్ మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దాంతో మరణ శిక్షను నిలిపివేసేందుకు భారత్ ఖతార్ సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌ను స్వీకరించిన ఖతార్.. రేపు వాదోపవాదాలు విననుంది. అయితే.. మన మాజీ నేవీ అధికారులను వదిలిపెట్టేందుకు కానీ కనీసం మరణ శిక్ష విధించకుండా ఆపేందుకు కానీ ఖతార్ మన నుంచి కొన్ని డిమాండ్లను కోరుతోంది. అవేంటంటే..
కొన్నేళ్లుగా ఖతార్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. ఉగ్రచర్యలకు పాల్పడే వారితో స్నేహం చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఉగ్రవాదాన్ని ప్రేరేపించేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే జాకిర్ నాయక్ (zakir naik) లాంటి వ్యక్తులకు ఖతార్ ఆతిథ్యం వహిస్తోంది. దాంతో ఖతార్‌పై సౌదీ అరేబియా, UAE వంటి దేశాలకు నమ్మకంపోయింది. ఖతార్‌లో దాదాపు 8 లక్షల మంది భారతీయులు వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు. (qatar)
మనకు ఖతార్ నుంచి రోజూ 14,000 చమురు (oil) డ్రమ్ములను ఖతార్ పంపుతుంటుంది. మనకు చమురు దిగుమతి చేసే దేశాల్లో ఖతార్ ఏడో స్థానంలో ఉంది. ఖతార్‌కు అగ్రరాజ్యం అమెరికాతో (america) మంచి సత్సంబంధాలు ఉండటంతో ఖతార్ మనకు కూడా దౌత్య పరంగా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఎంత స్నేహం ఉన్నప్పటికీ మన నేవీ అధికారులు ఖతార్ అస్సలు సహించలేని గూఢచర్యానికి పాల్పడటంతో కనికరం చూపించకుండా మరణ శిక్ష విధించింది.
ఈ అంశాల్లో మనం ఖతార్ కంటే ఎక్కువే అయినప్పటికీ ఖతార్ మనల్ని బేఖాతర్ చేస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఇజ్రాయెల్ పాలెస్తీనా యుద్ధం విషయంలో భారత్ ఇజ్రాయెల్ వైపు నిలబడటమే.భారత్ ఖతార్ కంటే 10 రెట్లు మిలిటరీ ఖర్చులు భరిస్తుంది. రక్షణ శాఖ విషయంలో ఖతార్ కంటే మనం 20 రెట్లు పైనే ఉన్నాం. అందుకే ప్రపంచ దేశాల ముందు ఖతార్ భారత పరువు తీయాలనుకుంటోందని పొలిటికల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (qatar)
భారత్‌కు సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, UAEలలో మద్దతు పెరిగిపోతోంది. దాంతో ఎక్కడ ఖతార్‌కు తన పవర్ తగ్గిపోతుందో అన్న భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాద నిర్మూలన కోసం గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు ఫండింగ్ లభిస్తోంది. ఇది ఖతార్‌కు నచ్చడంలేదు. ఒకవేళ ఖతార్ డిమాండ్స్ ఇవే అయితే ఆ ఎనిమిది మంది కోసం భారత్ తన నియమాలను పక్కన పెడుతుందా లేదా అనేది కూడా చర్చించాల్సిన అంశమే.