Kerala Blast: రూ.3000తో IEDకొని.. నిందితుడి సంచలన విషయాలు
Kerala Bomb Blast: నిన్న కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో ఉన్న కలమస్సెరీ కన్వెన్షన్ సెంటర్లో వరుసగా మూడు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈరోజుతో మృతుల సంఖ్య 3కి చేరింది. అయితే నిందితుడు నిన్ననే పోలీసులకు సరెండర్ అయిపోయాడు. అతని పేరు డామినిక్ మార్టిన్. రూ.3000తో IED పదార్థాలు కొని వాటిని టిఫిన్ బాక్సుల్లో దాచి కన్వెన్షన్ సెంటర్లో పెట్టానని ఒప్పుకున్నాడు. ఈ పేలుళ్లకు పాల్పడటానికి కారణం ఆ కన్వెన్షన్ సెంటర్లో వారు చెప్పేవన్నీ రాజద్రోహం కిందికి వస్తాయని అందుకే పేలుళ్లకు పాల్పడ్డానని నిందితుడు డామినిక్ తెలిపాడు.
యూట్యూబ్లో బాంబులు ఎలా తయారుచేస్తారో చూసి ఈ దాడికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. కొచ్చిలోని తమ్మనం ప్రాంతంలో ఉన్న తన ఇంటిపైన తాను తయారుచేసిన బాంబులను పేల్చి ట్రయల్ టెస్ట్ కూడా చేసానని అన్నాడు. ముందు బాంబులను టిఫిన్ బాక్సుల్లో పెట్టానని చెప్పి ఆ తర్వాత ఆరు ప్లాస్టిక్ ప్యాకెట్లలో పెట్టానని అన్నాడు. బాంబులతో పాటు పెట్రోల్ బాటిల్స్ కూడా రెడీగా ఉంచుకున్నట్లు పేర్కొన్నాడు. ప్రార్థన జరుగుతున్న కన్వెన్షన్ సెంటర్లో దాదాపు 2000 మంది ఉన్నారు. వారిలో నిందితుడి అత్తగారు కూడా ఉన్నారు. ఆమెకు ఈ దాడి గురించి తెలీదని తృటిలో తప్పించుకుందని నిందితుడు పోలీసుల విచారణలో బయటపెట్టాడు. (kerala bomb blast)