Suma: సుమతో జ‌ర్న‌లిస్ట్ గొడ‌వ‌.. ఇవే త‌గ్గించుకోవాలంటూ..

యాంక‌ర్ సుమ (suma) గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. యాంక‌ర్ అంటే ఇలా క‌దా ఉండాలి అనేంత‌గా సుమ‌క్క ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. అస‌లు సుమ‌ ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి వివాదాల్లో కూడా చిక్కుకోలేదు. కానీ తొలిసారి ఓ జ‌ర్న‌లిస్ట్ సుమ యాంక‌రింగ్‌పై అభ్యంత‌రం తెలిపారు. ఆ జ‌ర్న‌లిస్ట్ మిర్చి 9లో ప‌నిచేస్తున్నారు. అస‌లు మ్యాటర్ ఏంటంటే.. పంజా వైష్ణ‌వ్ తేజ్, శ్రీలీల న‌టించిన ఆదికేశ‌వ (adikeshava) సినిమాకు సంబంధించి టీం ఓ ప్రెస్ మీట్ ఏర్పాటుచేసారు.

ఈవెంట్ మొద‌ల‌వ్వ‌డానికి ముందు ప్రెస్ మీట్‌కి వ‌చ్చిన జ‌ర్న‌లిస్ట్‌ల‌కు స్నాక్స్ పెట్టారు. దీనిపై సుమ ఎప్ప‌టిలాగే ఓ పంచ్ వేసారు. వీళ్లు స్నాక్స్ భోజ‌నంలా తిన్నారు అని కామెంట్ చేసారు. ఆమె స‌ర‌దాగా అన్న‌ప్ప‌టికీ మిర్చి 9 జర్న‌లిస్ట్‌కి చాలా కోపం వ‌చ్చింది. దాంతో మొహ‌మాటం లేకుండా మీరు అలా అన‌కుండా ఉండాల్సింది అనేసారు. దీనికి సుమ స్పందిస్తూ.. స‌ర‌దాగా అన్నానే త‌ప్ప వేరే ఉద్దేశంతో కాదు.. మీరు స్నాక్స్ స్నాక్స్‌లాగే తిన్నారు ఓకేనా అన్నారు. దీనిపై ఆ జ‌ర్న‌లిస్ట్ స్పందిస్తూ.. ఇవే.. ఇలాంటి త‌గ్గించుకుంటేనే మంచిది అన్నారు. దాంతో ఎందుకు వ‌చ్చిన గొడ‌వ‌లే అనుకుని సుమ కూడా సారీ చెప్పి మౌనంగా ఉండిపోయారు. సుమ‌పై ఎప్పుడూ కూడా ఇలాంటి వివాదాలు త‌లెత్త‌లేదు. దాంతో ఈ వీడియో కాస్తా ఇప్పుడు తెగ వైర‌ల్ అవుతోంది. (suma)