Donald Trump: కోటీశ్వ‌రుల ముందు భార్య‌ను బికినీలో ర‌మ్మ‌న్నారా?

అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald trump) గురించి ఒక వ్య‌క్తి బ‌య‌ట‌పెట్టిన వార్త వైర‌ల్ అవుతోంది. ఆ వ్య‌క్తి ఎవరో కాదు.. ఆస్ట్రేలియాకు చెందిన బిలియనేర్ ఆంటోనీ ప్రాట్ (antony pratt). ఇంత‌కీ ఆంటోనీ ఏమ‌న్నారంటే.. మారా లాగో అనే స్విమ్మింగ్ పూల్ ద‌గ్గ‌ర డొనాల్డ్ త‌న భార్య మెలానియా ట్రంప్‌ను (melania trump) బికినీలో న‌డ‌వాల‌ని చెప్పార‌ట‌. ఇలా చేస్తే త‌న‌తో పాటు అక్క‌డే ఉన్న ఇత‌ర కోటీశ్వ‌రులు ఏం మిస్స‌వుతున్నారో తెలిసొస్తుందని అలా చేయ‌మ‌న్నార‌ట‌. దీనికి మెలానియా స్పందిస్తూ.. డొనాల్డ్ ట్రంప్ బికినీ వేసుకుని త‌న‌తో పాటు న‌డిస్తేనే తానూ న‌డుస్తాను అనింద‌ట‌.

ఈ ఆరోప‌ణ‌ల‌పై ట్రంప్ స్పందిస్తూ.. అవ‌న్నీ ఫేక్ అని అన్నారు. ట్రంప్ మాజీ జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు జాన్ బోల్టన్ ట్రంప్ అన్న మాట‌ల ఆడియో రికార్డింగ్‌ల‌ను లీక్ చేసిన‌ట్లు ఒప్పుకున్నాడు. ట్రంప్‌, ఆంటోనీల మ‌ధ్య మంచి స్నేహం ఉంద‌ని.. ట్రంప్ సీక్రెట్స్ అన్నీ రాబ‌ట్ట‌గ‌లిగే స‌త్తా ఆంటోనీకి ఉంద‌ని జాన్ బోల్ట‌న్ తెలిపాడు. ట్రంప్ త‌న ద‌గ్గ‌ర ఎంత డ‌బ్బు హోదా ఉందో ఆంటోనీకి తెలియ‌జేయాల‌నుకుంటున్నాడ‌ని అలా ఒక డీల్ సెట్ చేసుకోవాల‌నుకున్నాడ‌ని జాన్ బోల్ట‌న్ వెల్ల‌డించాడు. (donald trump)