మరో కరోనా మహమ్మారి రాబోతోంది..చైనా సైంటిస్ట్ హెచ్చరిక
త్వరలో కరోనా (corona) లాంటి మరో వైరస్ ప్రపంచదేశాలపై దాడి చేయబోతోంది. ఈ విషయాన్ని చైనాకు (china) చెందిన ప్రముఖ వైరాలజిస్ట్ షీ చెంగ్లీ వెల్లడించారు. ఈమె ఎక్కువగా వైరస్‌లపై రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. అందుకే ఈమెను చైనా బ్యాట్ ఉమెన్ అని పిలుస్తుంది. వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న చెంగ్లీ.. దాదాపు 20 ఏళ్లుగా కరోనా వైరస్‌లపై రీసెర్చ్ చేస్తోంది. ఈ ఏడాది జులైలో చెంగ్లీ.. తన టీం కలిసి చైనీస్ న్యూస్పేపర్లో ఓ వార్తను ప్రచురించారు. అందులో దాదాపు 40 రకాల కోవిడ్ తరహా వైరస్లు మానవాళిని పీడించనున్నాయని వీటిలో ఆరు వైరస్ల వల్ల ఆల్రెడీ ఎన్నో ఇన్ఫెక్షన్లు వచ్చాయని పేర్కొన్నారు. ఈ తరహా వైరస్లు ప్రాణాంతకమని రాసారు. (china)
రానున్న కొన్ని సంవత్సరాలలో మరో కరోనా లాంటి వైరస్ దాడి చేయబోతోందని తమ రీసెర్చ్‌లో తేలిందని తెలిపారు. ఆల్రెడీ ఈ వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా వ్యాపించింది అని అమెరికా గతంలో ఆరోపణలు చేసింది. దీని వల్ల వుహాన్ ల్యాబ్‌కు ఫండ్స్ ఇవ్వకూడదని కూడా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో చెంగ్లీ మళ్లీ ఈ వార్తను ప్రచురించి చర్చనీయాంశంగా మారింది. ఆల్రెడీ కోవిడ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మృత్యువాతపడ్డారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో చెంగ్లీ మరో కరోనా వైరస్ దాడి చేయబోతోంది అని ప్రకటించడంతో వివిధ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.