Diabetes: ఈ నూనెలు వాడుతున్నారా..?
Hyderabad: డయాబెటిస్ (diabetes) సమస్య ఉన్నవారు ఏం తినాలన్నా తాగాలన్నా ఆచి తూచి వ్యవహరించాలి. వంటకు వాడే నూనెల (cooking oils) విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. అసలు ఏ నూనెలు వాడితే బ్లడ్ షుగర్ (blood sugar) కంట్రోల్‌లో ఉంటుందో తెలుసా? వంటకు వాడే నూనెల్లో డైటరీ ఫ్యాట్ ఉంటుంది. ఇదే మన గుండె, లివర్ బాగా పనిచేసేలా చేస్తుంది. కానీ డయాబెటిక్ పేషెంట్స్ కొన్ని రకాల నూనెలతో తయారుచేసిన పదార్థాలే తినాలని అంటున్నారు నిపుణులు.
వర్జిన్ ఆలివ్ ఆయిల్ (virgin olive oil)
ఇది అన్ని రకాలుగా మంచిదేనని రీసెర్చులలో కూడా తేలింది. షుగర్ ఉన్నవారు ఈ ఆయిల్‌ని వాడితే బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది.
అవొకాడో నూనె (avocado oil)
డయాబెటిస్ ఉన్నవారికి అవొకాడో నూనె ఎంతో మంచిది. ఇందులో ఉండే మోనో అన్‌సాచురేటెడ్ కొవ్వు గుండె, లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది.
పల్లీ నూనె (peanut oil)
ఇందులో ఉండే మోనో అన్‌సాచురేటెడ్, పాలీ అన్‌సాచురేటెడ్ కొవ్వులు కూడా డయాబెటిక్ పేషెంట్స్‌కి ఎంతో మంచిది. కాకపోతే గానుగ నుంచి తీసినది బెటర్. పల్లీ నూనె తినడం వల్ల గుండె సమస్యలు 16% తగ్గుతాయని ఓ రీసెర్చ్‌లో తేలింది. కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ లెవల్స్ కూడా అదుపులో ఉంటాయి.
క్యానోలా నూనె (canola oil)
ఇది క్యానోలా అనే పువ్వు నుంచి తీసే నూనె. ఇన్సులిన్ అదుపులో ఉంచడమే కాకుండా గుండె పనితీరుని కూడా మెరుగుపరుస్తుందని స్టడీస్ చెప్తున్నాయి.