Ravi Teja: న‌న్ను ఆ సినిమా నుంచి తీసేసారా మాస్టారూ…?

Hyderabad: మాస్ మ‌హారాజా ర‌వితేజ (ravi teja) చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. ప్ర‌ముఖ క‌మెడియ‌న్ హ‌ర్ష చెముడు (harsha chemudu) త‌న కొత్త సినిమా స్టార్ట్ అవుతోంద‌ని ట్విట‌ర్లో అనౌన్స్ చేసారు. ఆ ట్వీట్‌కి ర‌వితేజ రిప్తై ఇస్తూ.. త‌మ‌రు అప్పుడు చెప్పిన క‌థ ఇదేనా మాస్టారూ.. మ‌మ్మ‌ల్ని సైలెంట్‌గా సైడ్ చేసారా ప్రాజెక్ట్ నుంచి అని ఫ‌న్నీగా ట్వీట్ చేసారు. దీనిని బ‌ట్టి చూస్తే హ‌ర్ష చెముడు చెప్పిన సినిమాలో ర‌వితేజ న‌టించాల్సి ఉందేమో. కొన్ని కారణాల వ‌ల్ల ర‌వితేజ‌ని ఇంక్లూడ్ చేయ‌లేద‌ని తెలుస్తోంది. ఇక‌పోతే నిన్న‌నే ర‌వితేజ త‌న కొత్త సినిమాను అనౌన్స్ చేసారు. ఈగ‌ల్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. న‌వ‌దీప్ కీ రోల్ ప్లే చేస్తున్నారు.