Meta: 21 వేల ఉద్యోగుల్ని తీసేస్తే…8000 కోట్లు బొక్క!
Hyderabad: ఖర్చులు తగ్గించుకోవడానికి ఇప్పటికే ఎన్నో వేల మందిని ఉద్యోగం నుంచి తొలగించేసింది మెటా (meta). ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ అయిన మెటా (meta) ఇప్పటివరకు 21 వేల మంది ఉద్యోగుల్ని తొలగించింది. అయితే వారిని తొలగించడానికి మెటాకు (meta) అయిన ఖర్చు అక్షరాలా 8,000 కోట్లు. ఉద్యోగుల్ని తొలగించే ముందు వారికి కొంత కాంపెన్సేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా 27 వేల మంది ఉద్యోగులను తీసేసినప్పుడు వారికి ఇచ్చిన కాంపెన్సేషన్ రూ.8,000 కోట్లు. అయితే అంత ఖర్చు భరించినప్పటినీ.. 27 వేల మందిని తొలగించాక 2023 ఆర్ధిక సంవత్సరంలో 28.65 బలియన్ డాలర్లు లాభపడిందట. 2023 మార్చిలోనే మూడు ఫేజుల్లో మెటా (meta) లే ఆఫ్‌లకు (lay off) పాల్పడింది. మూడు రోజుల క్రితం మూడో ఫేజ్‌లో 500 మంది ఉద్యోగుల్ని తొలగించింది. నవంబర్ 2022 నుంచి మెటా లే ఆఫ్‌లకు పాల్పడుతోంది. 6 నెలల్లోనే 11 వేల మందిని తొలగించింది. రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగులకు కష్టకాలమనే చెప్పాలి.