పుష్ప2లో నిహారిక.. క్లారిటీ ఇచ్చిన మెగా డాటర్​!

Hyderabad: ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​(Allu Arjun) హీరోగా క్రియేటివ్​ డైరెక్టర్​ సుకుమార్(Sukumar)​ రూపొందిస్తున్న సినిమా పుష్ప2(Pushpa2). గతేడాది విడుదలైన పుష్ప(Pushpa) సినిమాకు సీక్వెల్​గా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో ఓ గిరిజన యువతిగా మెగా డాటర్ నిహారిక కొణిదెల(Niharika KOnidela)నటిస్తోందంటూ కొన్నాళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా నిహారిక ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చారు.
గతంలో పలు సిరీస్ లు, సినిమాలు, షోలు చేసిన నిహారిక ఆ తర్వాత యాక్టింగ్ కి గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు నిహారిక తిరిగి యాక్టింగ్ లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తోంది. నిహారిక ముఖ్య పాత్రలో తెరకెక్కిన సిరీస్ డెడ్ పిక్సెల్స్(Dead Pixels). ఆన్లైన్ గేమ్స్(Online Games) యూత్ ని వాటికి ఎలా బానిసలుగా మార్చేస్తున్నాయి, వాటి వల్ల లైఫ్ లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి అనే అంశాలపై ఈ సిరీస్ ని తెరకెక్కించారు. ఈ సిరీస్ హాట్ స్టార్ ఓటీటీలో మే 19 నుండి స్ట్రీమింగ్ అవ్వనుంది.

ఈ వెబ్​ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా చాలా రోజుల తర్వాత నిహారిక మీడియా ముందుకు వచ్చారు. కొన్ని రోజుల క్రితం నిహారిక పుష్ప 2లో నటిస్తుందని వార్తలు వచ్చాయి. దీనిపై నిహారిక స్పందిస్తూ.. ‘ఇదంతా మీడియానే సృష్టించింది. నన్నైతే ఆ సినిమా నుంచి ఎవరూ సంప్రదించలేదు. అది చాలా మంచి సినిమా’ అని చెప్పుకొచ్చింది.