యూట్యూబర్‌గా షణ్ముఖ్ జశ్వంత్ ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ షణ్ముఖ్.. గతంలోనూ ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. ఇన్నాళ్లూ సంపాదించుకున్న పేరు ప్రతిష్టలను పోగొట్టుకుంటున్నాడు.
2013లో వచ్చిన ది వైవా అనే షార్ట్ ఫిలింతో ఫేమస్ అయ్యాడు షణ్ముఖ్
ది సాఫ్ట్వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్‌తో షణ్ముఖ్ ఫేమస్ అయిపోయాడు. అతని యాక్టింగ్‌కి చాలా మంది ఫిదా అయిపోయారు.
ఆ తర్వాత సూర్య అనే మరో వెబ్ సిరీస్‌లో నటించి 40 లక్షల సబ్స్క్రైబర్లు కలిగిన ఏకైక తెలుగు యూట్యూబర్‌గా పేరుపొందాడు.
రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న షణ్ముఖ్ రన్నరప్‌గా నిలిచాడు.
2018లో నన్ను దోచుకుందువటే అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఎక్కువగా తన యూట్యూబ్ కంటెంట్‌నే చేసుకోవాలని అనుకుంటున్నాడట.
ఇలా పాపులారిటీ సంపాదించుకున్న షణ్ముఖ్.. రెండేళ్ల క్రితం ర్యాష్ డ్రైవింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. షణ్ముఖ్ జీవితంలో తొలి వివాదం ఇదే
మళ్లీ ఈరోజు డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిపోయాడు. విచిత్రం ఏంటంటే.. ఇతని అన్న సంపత్ వినయ్ ఓ యువతిని మోసం చేసిన కేసులో పోలీసులు విచారణ చేపడుతుండగా షణ్ముఖ్ గంజాయితో దొరికిపోయాడు. అలా అన్నదమ్ములు ఇద్దరూ పోలీసులకు చిక్కారు.