ఈ వాచీని చూసారా..? చూడగానే తెలిసిపోతుంది కదూ ఇది మామూలు వాచీ కాదని. దీని ధరెంతో.. దీని విశేషాలేంటో తెలుసుకుందాం
ఈ వాచీ పేరు గ్రాఫ్ హల్యుసినేషన్. లండన్‌కి చెందిన గ్రాఫ్ డైమండ్స్ సంస్థ 2014లో తయారుచేసింది
30 మంది ప్రత్యేక డిజైనర్లు ఈ వాచీని 110 క్యారెట్ల వజ్రాలతో తయారుచేసారు
దీని ధర రూ.456 కోట్లు. ప్రపంచంలోనే అత్యంత విలువైన వాచీగా పేరుగాంచింది
ఇక మన దేశంలో ఇలాంటి వాచీ కాకపోయినా అత్యంత ఖరీదైన వాచీలు ముఖేష్ అంబానీ.. ఆయన కుమారుల ద్ద ఉన్నాయి. ఇటీవల జరిగిన పెళ్లి వేడుకలో చిన్న కుమారుడు రూ.18 కోట్ల విలువైన వాచీ ధరించాడు.