పెద్దలను కలిసినప్పుడు వారి కాళ్లు మొక్క ఆశీర్వాదం తీసుకుంటాం. అలా చేస్తే ఏమవుతుంది? అసలు పెద్దల కాళ్లకు ఎందుకు నమస్కరించాలి?
పెద్దల కాళ్లు మొక్కినప్పుడు మన చేతి వేళ్లు వారి కాలి వేళ్లను తగిలి వారిలోని పాజిటివ్ ఎనర్జీ మనకు కలుగుతుందట.
పెద్దల కాళ్లు మొక్కేటప్పుడు మీలోని అహం, అహంకారం అంతా పోతుంది. వారు మనల్ని ఆశీర్వదించినప్పుడు జాలి, ప్రేమ మనకు కలిగేలా చేస్తారు.
మరి పెద్దల కాళ్లకు ఎలా మొక్కాలి?
పెద్దల పాదాలకు నమస్కరించే సమయంలో మోకాళ్లు కాకుండా శరీర పై భాగాన్ని వంచాలి. మీరు నమస్కరిస్తున్న వారి కుడి కాలి బొటన వేలుకు మీ ఎడమ చెయ్యి, ఎడమ కాలి బొటన వేలుకు మీ కుడి చేతిని తాకించాలి.