ఈనెల 8న మహా శివరాత్రి. ఈ పర్వదినాన శివయ్యకు సమర్పించాల్సిన నైవేధ్యాలేంటో తెలుసుకుందాం
శివరాత్రి రోజున శివయ్యకు తప్పనిసరిగా తాజా బిల్వ పత్రాలతో పూజించాలి
బిల్వ చెట్టుకు కాసే పండ్లు కూడా శివయ్యకు నైవేధ్యంగా పెట్టచ్చు. వీలైతే పెట్టి చూడండి. ఎంతో పుణ్యం
శివయ్యకు సమర్పించే ముఖ్యమైన నైవేధ్యాలలో పాలు ప్రధానం. లింగానికి పాలాభిషేకం చేస్తే ఎంతో మంచిది
తేనెతో అభిషేకం చేసి దానిని నైవేధ్యంగా సమర్పించినా మంచిదే
శివయ్య ఆశీర్వాదం కోసం పెరుగుతో అభిషేకం చేసినా మంచిదే. పెరుగు లింగానికి కూడా ఎంతో చలువ చేస్తుంది
నెయ్యి లేనిదే ఏ పూజ కానీ అభిషేకం కానీ ఉండదు. మీరు శివరాత్రి రోజున అభిషేకం చేస్తున్నట్లైతే తప్పనిసరిగా అందులో నెయ్యి ఉండేలా చూసుకోండి.
గంగి రేగి పండ్లు, తమలపాకులను కూడా నైవేధ్యంగా పెట్టచ్చు. ఇవన్నీ కూడా అభిషేకానికి ఉపయోగిస్తారు. వీటిని నైవేధ్యంగానూ స్వీకరిస్తారు