వేసవి మొదలైపోయింది. ఈ సీజన్‌లో చెరుకు రసం ఎక్కువగా తాగాలి అనిపిస్తుంటుంది. అయితే.. రోజూ చెరుకు రసం తాగితే ఏమవుతుంది? మంచిదేనా?
చెరుకు రసంలో ఫ్రక్టోస్, గ్లూకోజ్ ఎక్కువగా ఉంటాయి. ఒక రెండు మూడు చెరుకు గడలను మెషీన్‌లో వేసి జ్యూస్ తీస్తారు కాబట్టి కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి.
చెరుకు రసం తాగిన వెంటనే బ్లడ్ షుగర్ వెంటనే పెరిగిపోతుంది. తింటూ చెరుకు రసం మాత్రం తాగకూడదు.
రోజూ తాగడం కంటే వారంలో రెండు సార్లు తాగడం మంచిది.
డయాబెటిస్ పేషెంట్లు చెరుకు రసానికి దూరంగా ఉండటమే మంచిది.
ఖాళీ కడుపున చెరుకు రసం తాగడం మంచిది. ఒకవేళ మీకు ఏదన్నా తిని ఉంటే రెండు గంటలు ఆగి తాగడం బెటర్