మునక్కాళ్లను చాలా మంది తింటారు కానీ వాటి ఆకులైన మునగాకు మాత్రం చాలా తక్కువగా తింటారు. అసలు మునగాకు తినడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలేంటో తెలిస్తే వదిలిపెట్టరు
విటమిన్ ఏ, సి, పొటాషియం, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. సాధారణ ఆకుకూరలతో పోలిస్తే మునగాకులో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు
డయాబెటిక్ పేషెంట్లకు మునగాకు ఎంతో మంచిది. బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుతుంది
రోజూ మునగాకును తీసుకుంటే రోగనిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. మీలో మీకే తెలీని ఎనర్జీ వస్తుంది
మెటబాలిజం పెరిగి బరువు అదుపులో ఉంచుతుంది.
మునగాకు పొడి కూడా అమ్ముతున్నారు. మునగాకుతో వంటలు చేయలేని వారు ఈ పొడిని నీటిలో కలిపి తీసుకోవచ్చు. కాకపోతే వైద్యులను సంప్రదిస్తే మరింత క్లారిటీ వస్తుంది