ముఖేష్‌, నీతా అంబానీల మూడో వార‌సుడు అనంత్ అంబానీ వివాహం.. రాధికా మ‌ర్చెంట్‌తో వైభ‌వంగా జ‌రుగుతోంది. గుజ‌రాత్‌లోని జామ్ న‌గ‌ర్‌లో వీరి వివాహం జ‌రుగుతోంది.

ఈ వేడుక‌కు సినీ, వ్యాపార‌, రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌రయ్యారు.

వేడుక‌కు ఇంట‌ర్నేష‌న‌ల్ పాప్ సింగ‌ర్ రిహాన్నాను కూడా ర‌ప్పించారు. పెళ్లి వేడుక‌లో పెర్ఫామెన్స్ చేయ‌డానికి సెల‌బ్రిటీల‌కు అంబానీలు ఎంతిస్తారో తెలుసా?

ఈ వేడుక‌లో పాప్ సింగ‌ర్ రిహాన్నా పెర్ఫామ్ చేయ‌బోతోంది. ఇందుకోసం అంబానీలు రిహాన్నాకు ఇచ్చిన రెమ్యున‌రేష‌న్ రూ.66 కోట్లు

ఇషా అంబానీ పెళ్లికి అంత‌ర్జాతీయ సింగ‌ర్ బియాన్సే వ‌చ్చి పెర్ఫామ్ చేసింది. ఈమె అందుకున్న పారితోషికం రూ.33 కోట్లు

ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహ‌తా వివాహ స‌మ‌యంలో మెరూన్ 5 అనే మరో ఇంట‌ర్నేష‌న్ సింగ‌ర్ పెర్ఫామ్ చేసాడు. ఇత‌నికి ఇచ్చిన పారితోషికం రూ.8 నుంచి రూ.12 కోట్లు

వీరి నిశ్చితార్ధం ఇట‌లీలోని లేక్ కోమోలో జ‌రిగింది. ఆ స‌మ‌యంలో ఇంట‌ర్నేష‌నల్ సింర‌గ్ జాన్ లెజెండ్ పెర్ఫామ్ చేసాడు. ఇందుకు ఆయ‌న తీసుకున్న పారితోషికం రూ.8 కోట్లు