ఇతని పేరు అన్నామలై. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. బీజేపీ యాంగ్రీ యంగ్ మ్యాన్ అని పిలుస్తుంటారు
పోలీస్ ఆఫీసర్‌గా పనిచేసి బీజేపీలో చేరిన అన్నామలై అంటే ప్రతిపక్షాలకు ఒళ్లు మంట
రాష్ట్ర అధ్యక్షుడిగానే ప్రతిపక్షాలను అల్లాడిస్తున్న ఈ ముక్కోపి.. లోక్ సభ ఎన్నికల్లో టికెట్ కొట్టబోతున్నాడు
బీజేపీ నుంచి చిన్న వయసులోనే రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైన ఏకైక నేత ఇతనే
ఇతని వల్లే తమిళనాడులో బీజేపీకి మంచి పట్టు లభించింది
2023 వరకు బీజేపీ.. తమిళనాడు అధికార పార్టీ డీఎంకే పొత్తులో ఉన్నాయి. అన్నామలై వల్ల ఆ పొత్తు కాస్తా చిత్తు అయిపోయింది.
పొత్తు పోయినా కూడా అతన్ని పార్టీ తొలగించలేదంటే పార్టీలో అతను సాధించిన పట్టు ఏంటో తెలుస్తోంది
ఇప్పుడు ఇతను లోక్ సభ ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెడితే ఎంత విధ్వంసం సృష్టిస్తాడో వేచి చూడాలి