ఎండాకాలం వ‌చ్చేసింది. మ‌జ్జిగ విప‌రీతంగా తాగేస్తుంటారు. ఎంతో చ‌లువ చేసే ఈ మ‌జ్జిగ‌తో ఎన్నో లాభాలున్నాయ్‌. అవేంటో తెలుసా?

మ‌జ్జిగ‌లో పొటాషియం లాంటి ఎల‌క్ట్రోలైట్స్ ఉంటాయి. ఇది శ‌రీరంలో నీటి శాతం త‌గ్గిపోకుండా చేస్తుంది

ఇందులో బ్యాక్టీరియా, ల్యాక్టిక్ యాసిడ్ ఉంటాయి. దాంతో జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నా కూడా పోతాయి

ఇందులో రైబోఫ్లేవిన్ ఉంటుంది. దీని వ‌ల్ల శ‌రీరం ఎన‌ర్జిటిక్‌గా ఉంటుంది

మ‌జ్జిగ‌లో క్యాల్షియం ఉంటుంది కాబ‌ట్టి ఎముక‌లు, ప‌ళ్ల‌కు మంచిది

అసిడిటీ స‌మ‌స్య‌లు పోతాయి. బీపీ కంట్రోల్‌లో ఉంటుంది

చ‌ర్మం నిగ‌నిగ‌లాడుతుంది. బ‌రువు త‌గ్గ‌డంలో సాయ‌ప‌డుతుంది

ఒంట్లోని మ‌లినాల‌ను, విష ప‌దార్థాల‌ను దూరం చేస్తుంది