ఇప్పుడు H1B వీసాలకు చాలా డిమాండ్ పెరిగిపోయింది. ఈ వీసాల కోసం ఎంతో మంది భారతీయులు ఎదురుచూస్తున్నారు. H1B రాకపోతే.. ప్రత్యామ్నాయంగా ఈ వీసాలను ప్రయత్నించండి
L1 వీసా- ఇదొక నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా. అమెరికన్ కంపెనీలు తమ వద్ద పనిచేస్తున్న విదేశీయులను అమెరికాలోని తమ ఆఫీసులకు బదిలీ చేయిస్తున్నారు.
O1 వీసా- ఇది కూడా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసానే. ఈ వీసా ద్వారా అమెరికన్ కంపెనీలు సైన్స్, విద్య, వ్యాపారం, అథ్లెటిక్స్, ఆర్ట్స్‌కి సంబంధించిన రంగాలకు చెందిన విదేశీయులను హైర్ చేసుకుంటారు.
E2 వీసా- విదేశీయులు అమెరికాలో పెట్టుబడులు పెడితే.. వారికి ఈ వీసా సులువుగా వచ్చేస్తుంది.
రిమోట్ వర్క్ - అమెరికాకి వెళ్లి పనిచేయకుండా అక్కడి నుంచే విదేశీయులకు వర్క్ ఫ్రం హోం అవకాశాలు ఉన్నాయి. ఈ రిమోట్ వర్క్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఉద్యోగం చేసుకోవచ్చు. జీతాలు కూడా బాగుంటాయి