శరీరంపై పుట్టు మచ్చలకు అర్థమేంటి? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అవి ఉన్న చోటకు అర్థమేంటి? వంటి అంశాలను తెలుసుకుందాం
ముక్కుపై పుట్టు మచ్చ ఉంటే మీ ప్రేమ, వైవాహిక జీవితం బాగుంటుందని అర్థం. అయితే ముక్కుకి కుడివైపు పుట్టు మచ్చ ఉంటే వారికి అంత కలిసి రాదట
మెడపై పుట్టు మచ్చ ఉంటే వారు జీవితంలో ఎదుగుతారు. అదృష్టం ఎప్పుడూ వారి వెంటే ఉంటుంది.
బుగ్గకు ఎడమ వైపు పుట్టు మచ్చ ఉంటే వారు ఫ్యామిలీకి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఇలాంటివారు తల్లిదండ్రుల మాట జవదాటరు
అరచేతిపై పుట్టు మచ్చ ఉంటే వారు ఎప్పుడూ కోపంగా, చికాగుగా ఉంటారు. వీరిని కదిలిస్తే కొట్టడానికి కూడా వెనుకాడరట.
గడ్డంపై పుట్టు మచ్చ ఉంటే ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తారు. ముఖ్యంగా అమ్మాయిలకు గడ్డం మధ్యలో పుట్టు మచ్చ ఉంటే వారికి ఎవరైనా ఆకర్షితులు అవుతారట.
కాలికి కుడి వైపున పుట్టు మచ్చ ఉంటే వారికి ఆర్ధిక కష్టాలు ఉండవట. అదే ఎడమ కాలిపై ఉంటే వారు స్వాతంత్రంగా బతకడానికి ఇష్టపడతారట.
పెదాలపై పుట్టు మచ్చ ఉంటే ఇతరులతో ఎప్పుడూ కలుపుగోలుగా ఉంటారట. కింద పెదవి భాగంలో పుట్టు మచ్చ ఉంటే తిండి పుష్ఠి ఎక్కువగా ఉంటుందట.