వైఎస్ సునీత‌, ష‌ర్మిళ‌కు ఊర‌ట‌.. జ‌గ‌న్‌కు ఎదురుదెబ్బ‌..!

big relief to ys sharmila and ys sunitha from supreme court

AP Elections: APCC చీఫ్ వైఎస్ ష‌ర్మిళ‌.. వైఎస్ సునీతా రెడ్డిల‌కు సుప్రీంకోర్టు నుంచి భారీ ఊర‌ట ల‌భించింది. ఎన్నిక‌లు అయ్యే వ‌ర‌కు వైఎస్ వివేకానంద రెడ్డి మ‌ర్డ‌ర్ గురించి మాట్లాడ‌కూడ‌దు అంటూ ఏపీ ప్ర‌భుత్వం హైకోర్టులో పిటిష‌న్ వేయ‌గా.. ష‌ర్మిళ‌, సునీత‌ల‌కు క‌డ‌ప హైకోర్టు గ్యాగ్ ఆర్డ‌ర్ జారీ చేసింది. ఎన్నిక‌లు అయ్యే వ‌ర‌కు వైఎస్ వివేకా మ‌ర్డ‌ర్ టాపిక్ ఎత్త‌కూడ‌దు అని ఆర్డ‌ర్‌లో పేర్కొంది. దీనిని సునీత సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయ‌గా.. తీర్పు వారికి అనుకూలంగా వ‌చ్చింది. గ్యాగ్ ఆర్డ‌ర్‌పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. గ్యాగ్ ఆర్డ‌ర్ వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛను అడ్డుకునేలా ఉంద‌ని సుప్రీంకోర్టు అభిప్రాయ‌ప‌డింది.