ప్రైవేట్ భాగాలపై సిగరెట్లతో కాల్చి.. మర్మాంగం కోసేయబోయి..!
Viral News: ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ భర్తకు నరకం చూపించింది. దీని కంటే చావే నయంరా అనుకునేలా అతన్ని టార్చర్‌కు గురిచేసింది. ప్రైవేట్ భాగాల్లో సిగరెట్లతో కాలుస్తూ.. అతని మర్మాంగాన్ని కోసేయబోతే అతను ఎలాగోలా తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దాంతో విషయం వెలుగులోకి వచ్చింది. తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాధితుడు సీసీటీవీ కెమెరాలో చూపించగా.. పోలీసులు వెంటనే మహిళను అదుపులోకి తీసుకున్నారు.
2023లో బాధితుడు మన్నన్ జైదీ సియోహారా ప్రాంతానికి చెందిన మెహర్ జాన్‌ను వివాహం చేసుకున్నాడు. ఒక ఏడాది తర్వాత మెహర్ జాన్ కోరిక మేరకు వీరిద్దరూ వేరే కాపురం పెట్టారు. అయితే ఓసారి మన్నన్ జైదీకి తన భార్యకు మద్యం సేవించడం, సిగరెట్ తాగే అలవాట్లు ఉన్నాయని తెలిసింది. ఇదే విషయంపై నిలదీయగా.. అతన్ని టార్చర్‌కు గురిచేసింది. నోరు మూసుకుని అన్నీ భరించకపోతే చంపేస్తానని బెదిరించింది. ఈ ఏడాది ఏప్రిల్ 29న పాలల్లో మత్తు మందు కలిపి తనకు తాగించిందని.. తాను స్పృహ కోల్పోవడంతో కాళ్లు చేతులు కట్టేసి తన ప్రైవేట్ భాగాల్లో సిగరెట్లతో కాల్చిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. నొప్పికి తనకు మెలుకువ వచ్చి చూడగా.. కత్తితో మర్మాంగం కోయబోయిందని.. ఎలాగోలా తప్పించుకున్నానని వెల్లడించాడు.