బంగారం తాకట్టు లేదా అమ్ముకునే పరిస్థితి రాకూడదంటే ఏం చేయాలి?
Spiritual: చాలా మందికి బంగారం కొనే విషయంలో ఎన్నో సందేహాలు ఉంటాయి. ఏ రోజున కొనాలి.. ఏ తిథిన కొంటే మంచిది అనే విషయాలు కూడా తెలీవు. అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే మంచిది అనే విషయం మనందరికీ తెలిసిందే. మరి సాధారణ రోజుల్లో ఏ రోజున కొంటే మంచిది? ఏ రోజున కొంటే తాకట్టు పెట్టే, అమ్మేసే బాధలు తప్పుతాయో తెలుసుకుందాం.
బంగారంలో కలి పురుషుడు ఉంటాడు. అందుకే బంగారం వేసుకుని బయటికి వెళ్లినప్పుడు నరదృష్టి, నరఘోష ఎక్కువగా ఉంటుంది. పాడ్యమి, విధియ, తథియ తిథుల్లో బంగారం కొంటే ఎంతో మంచిది. ఈ తిథుల్లో బంగారం కొట్టే అమ్మాల్సిన లేదా తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ తాకట్టు పెట్టినా ఆ బంగారం వెనక్కి తెచ్చుకోగలిగి.. మళ్లీ తాకట్టు పెట్టాల్సిన అవసరం రాకుండా ఉంటుందట. అయితే మంగళవారం, శుక్రవారాలు బంగారం కొనడానికి మంచి రోజులు అంటారు కానీ అసలు ఆ రోజుల్లో మాత్రం అస్సలు కొనకూడదట.
ALSO READ: