తాగిన మైకంలో టాటూ ఆర్టిస్ట్.. మహిళ చేతిపై పురుషాంగం బొమ్మ!
Viral News: పాపం ఎంతో ముచ్చటపడి ఓ మంచి టాటూ వేయించుకోవాలని వెళ్లిన యువతికి చేదు అనుభవం చోటుచేసుకుంది. తాగిన మైకంలో ఆ టాటూ ఆర్టిస్ట్ ఏ బొమ్మ వేయాలో తెలీక పురుషాంగం బొమ్మ వేసేసాడు. నటాలీ రెనీ అనే 32 ఏళ్ల యువతికి ఈ ఘటన ఎదురైంది. హృదయాకారం నుంచి బాణం దూసుకెళ్లినట్లుగా కనిపించేలా టాటూ వేయమంటే ఆ ఆర్టిస్ట్ తాగిన మైకంలో పురుషాంగం వేసేసాడు. అతను వేస్తున్నది సరైనదే ఏమో అనుకుని నటాలీ కూడా ఆపలేదట. తీరా అంతా అయ్యాక చూసుకుంటే అది పురుషాంగంలా కనిపించే సరికి ఆమెకు ఒళ్లు మండిపోయింది. అతనితో గొడవ పడి ఒక్క పైసా చెల్లించకుండా వెళ్లిపోయింది. దాదాపు మూడేళ్ల తర్వాత ఏకంగా లక్ష రూపాయలు పెట్టి ఆ టాటూను తొలగించుకుందట. ఇందుకు కారణం పాపం వెంటనే టాటూను తొలగించుకోవడానికి ఆమె వద్ద కావాల్సిన డబ్బు లేకపోవడమేనట..!
ఇలాంటి మరిన్ని వార్తలు చదవడానికి చూడండి https://telugu.newsx.com/