శివరాత్రి రోజున పొరపాటున కూడా చేయకూడనివి కొన్ని ఉన్నాయ్. అవేంటంటే..
శివయ్యకు నలుపంటే ఇష్టం ఉండదు. కాబట్టి శివరాత్రి రోజున నలుపు ధరించకండి
శివయ్యకు ఎర్రటి పూలతో అస్సలు పూజించకండి. తెల్ల పూలతో మాత్రమే పూజించండి
తులసి ఆకులు, తులసి మాలను పొరపాటున కూడా శివయ్య దగ్గర ఉంచకండి
లింగం చుట్టూ ఎప్పుడూ కూడా పూర్తిగా ప్రదక్షిణ చేయకండి. అర్థవృత్తాకారంలో మాత్రమే ప్రదక్షిణ చేయాలి
బిల్వ పత్రాలతో పూజిస్తున్నట్లైతే.. ఆకులు చిరిగి, ఎండిపోయి ఉండకూడదు
కంచు పాత్రను వాడి లింగానికి ఎప్పుడూ పాలాభిషేకం చేయకూడదు. రాగి చెంబుతో మాత్రమే చేయాలి
కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయకూడదు