కొంద‌రు తెలీకుండానే ఉప్పు ఎక్కువ‌గా తినేస్తుంటారు. అలాంట‌ప్పుడు ఏం చేయాలి?  ఉప్పు వాడ‌కాన్ని ఎలా త‌గ్గించుకోవాలి?

బ‌య‌ట నుంచి తెప్పించుకునే ఆహారంలో స‌హ‌జంగానే ఉప్పు ఎక్కువ‌గా ఉంటుంది. అదే మీరు వండుకున్నార‌నుకోండి.. ఎంత ఉప్పు వేస్తున్నారో మీకు తెలుస్తుంది. దీని వ‌ల్ల ఉప్పు మోతాదు త‌గ్గుతుంది

మీరు ఏద‌న్నా తినే ప‌దార్థాన్ని కొనుగోలు చేస్తున్న‌ప్పుడు ఒక‌సారి సోడియం శాతం ఎంత వాడారు అనేది లేబుల్‌ను చ‌దివి తెలుసుకోండి. లేబుల్‌పై లో సోడియం, నో యాడెడ్ సాల్ట్, అన్‌సాల్టెడ్ అని రాసుంటేనే తీసుకోండి

ఉప్పుకి బ‌దులు సీజ‌నింగ్ వాడండి. దీని వ‌ల్ల అధికంగా ఉప్పు తిన‌కుండా ఉంటారు. రుచికి రుచీ ల‌భిస్తుంది.

ఉప్పు వాడ‌కాన్ని క్ర‌మంగా త‌గ్గించుకుంటే మీ నాలుక‌పై ఉండే టేస్ట్ బ‌డ్స్ కూడా ఆ రుచికి అల‌వాటు ప‌డుతాయి. ఉన్న‌ట్టుండి ఉప్పును త‌గ్గించేస్తే ఏం తిన్నా తిన‌ట్టే ఉండ‌దు.