కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ప‌ది సూప‌ర్ ఫుడ్స్ తింటే చాలు. అవేంటంటే..

ఆకుకూర‌లు:  వీటిలో పీచు ఎక్కువ‌గా ఉంటుంది కాబ‌ట్టి లివ‌ర్‌లోని విష ప‌దార్థాల‌ను బ‌య‌టికి పంపిచేస్తుంది

వెల్లుల్లి:  వెల్లుల్లిలో స‌ల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఇది లివ‌ర్‌లోని ఎన్‌జైంల‌ను యాక్టివేట్ చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది

ప‌సుపు: ఇందులో ఉండే క‌ర్క్యుమిన్‌లో యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ సుగుణాలు ఉంటాయి. లివ‌ర్‌ను బాగా ర‌క్షిస్తాయి

బీట్రూట్: ఇందులో అధికంగా నైట్రేట్స్ ఉంటాయి. లివ‌ర్ ప‌నిత‌నాన్ని మెరుగుప‌రుస్తాయి.

చేప‌లు:  ఫ్యాటీ చేప‌లైన సాల్మ‌న్, మాకెరైల్, సార్డీన్‌ల‌లో ఒమేగా 3 పుష్క‌లంగా ఉంటుంది. అల‌వాటు ఉంటే వారంలో మూడు సార్లు తినేయండి

వాల్న‌ట్స్:  చేప‌లు తినేవాలి వారు ఒమేగా 3 కోసం వాల్న‌ట్స్‌ని తినచ్చు

ఆలివ్ ఆయిల్:  లివ‌ర్ ఇన్‌ఫ్ల‌మేష‌న్‌ను త‌గ్గిస్తుంది

గ్రీన్ టీ:  గ్రీన్ టీలో కాటేచిన్స్ అనే కెమిక‌ల్ కాంపౌండ్ ఉంటుంది. ఇది ఫ్యాటీ లివ‌ర్‌ను ఇన్‌ఫ్ల‌మేష‌న్‌ను త‌గ్గించేస్తుంది.