Covid: తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌లో కేసులు పెర‌గడానికి కార‌ణం ఇదే

Covid: కోవిడ్ కేసులు ఎక్కువ అవుతున్న నేప‌థ్యంలో తెలంగాణ‌ (telangana), క‌ర్ణాట‌క‌కు (karnataka) చెందిన కొంద‌రు కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉన్న‌ప్ప‌టికీ భ‌యంతో ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డంలేదు. క‌నీసం త‌మ‌కు ఆ ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని ఇంట్లో వారికి కానీ బ‌య‌టి వారికి కానీ చెప్ప‌క‌పోవ‌డంతోనే కేసులు పెరుగుతున్న‌ట్లు ఓ స‌ర్వేలో తేలింది. ప‌ది మందికి కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉంటే వారిలో ఇద్ద‌రు మాత్ర‌మే ప‌రీక్ష‌లు చేయించుకుంటున్నారు. ఇక క‌ర్ణాట‌క‌లో అయితే ప్ర‌తి ప‌ది మందిలో ఏడుగురు ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డంలేదు.

తెలంగాణ నుంచి 5 శాతం, క‌ర్ణాట‌క నుంచి 9 శాతం మంది మాత్ర‌మే RT-PCR టెస్టులు చేయించుకుంటున్నారు. ల‌క్ష‌ణాలు ఉన్నా వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోక‌పోవ‌డానికి కార‌ణం గ‌తంలో వ‌చ్చింది కోలుకున్నాం.. ఇప్పుడు కూడా ట్యాబ్లెట్లు వేసుకుంటే త‌గ్గిపోతుంది అనే భావ‌నే. ఇలా అయితే ఇక కేసులు పెరుగుతూనే ఉంటాయ‌ని వైద్య శాఖ కూడా హెచ్చ‌రిస్తోంది. ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే టెస్టులు చేయించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. లేదంటే వారికి వారే ఇత‌రుల‌కు సోకకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు.