Ghee: చ‌లికాలంలో నెయ్యి ఎందుకు తినాలి?

చ‌లికాలంలో  (winter) త‌ప్ప‌నిస‌రిగా నెయ్యి (ghee) తినాల‌ని అంటారు. ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాల్లో నెమ్మదిగా ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. ఈ చ‌లికాలంలో నెయ్యి తిన‌డం వ‌ల్ల రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఏవైనా అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్నా.. దెబ్బ‌లు త‌గిలినా చ‌లికాలంలో ఒక‌ప‌ట్టాన త‌గ్గ‌వు. కాబ‌ట్టి చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. కానీ నెయ్యి తిన‌డం వ‌ల్ల లావు అయిపోతార‌ని చాలా మంది దీనికి దూరంగా ఉంటారు. నిజానికి నెయ్యిలో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. దానిని తినే ప‌ద్ధ‌తిలో తింటే ఎలాంటి బ‌రువు పెర‌గ‌రు.

చ‌లికాలంలో నెయ్యిని ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరాన్ని వెచ్చ‌గా ఉంచుతుంది. నెయ్యిలో విట‌మిన్ A, D, E కూడా ఉంటాయి. రోగ‌నిరోధ‌క శ‌క్తి పెర‌గాల‌న్నా ఎముక‌లు దృఢంగా ఉండాల‌న్నా ఈ విట‌మిన్లు ఎంతో కీల‌కం. మిగ‌తా కాలాల్లో కంటే చ‌లికాలంలో నెయ్యిని భోజ‌నంలో క‌లుపుకుని తిన‌డం వ‌ల్ల మ‌రింత రుచిక‌రంగా ఉంటుంది. చ‌పాతీలు తింటున్న స‌మ‌యంలో ఒక స్పూన్ నెయ్యి వాటిపై రాసుకుని తినండి. ఆ రుచి ఎంతో అమోఘంగా ఉంటుంది. ఈ చ‌లికాలంలో కూర‌లు, ప‌ప్పు వండేట‌ప్పుడు నూనె కాకుండా నెయ్యి వేసి వండండి. (ghee)

మీరు ఏదైనా సూప్ తాగుతుంటే అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని తాగండి. ఆరోగ్యానికి చాలా మంచిది. స్వీట్ కార్న్ , పాప్ కార్న్ వంటి స్నాక్స్ ఇంట్లోనే వండుకుంటున్న‌ప్పుడు కూడా ఒక స్పూన్ నెయ్యి వేసుకుని చేసుకోండి. రోజులో ఒక ఒక‌టి నుంచి స్పూన్ల నెయ్యి తింటే మంచిది. ఆ నెయ్యిని కూడా మీరు ఇంట్లోనే త‌యారుచేసుకోవ‌డం ఉత్త‌మం. బ‌య‌ట దొరికేవి నాసిర‌కంగా ఉంటాయి. కుదిరితే మీరే నెయ్యిని ఇంట్లో త‌యారుచేసుకుని ప‌ట్టుకోండి. ఉద‌యాన్నే పాలు, కాఫీ, టీ తాగే అల‌వాటు ఉంటే కాస్త ప‌సుపులో నెయ్యి వేసుకుని ముద్ద‌గా చేసుకుని ఆ ముద్ద‌ను పాలు, కాఫీ, టీలో క‌లుపుకుని తాగినా మంచిదే